నేటి గద్దర్ న్యూస్ ,ఖమ్మం ప్రతినిధి:
ప్రజా సేవకు అంకితమైన స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు సమాజానికి ఆదర్శప్రాయుడని అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ నరేష్ కుమార్, అడిషన్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీలు మాట్లాడుతూ ..ఒక సామాన్య కుటుంబం నుండి ఎదిగి రాజకీయ నాయకుడై పదివికే వన్నె తెచ్చిన, ప్రజల కష్ట, సుఖాలు తెలిసిన మహా మేధావి అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెదరని ముద్ర వేసుకున్నారని అన్నారు.
సమాజ సేవలో భాగంగా నక్సల్స్ ప్రభావిత మారుమూల ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించి ముందుకు కదిలిన శ్రీపాదరావును 1999 ఏప్రిల్ 13న మహదేవపూర్ మండలం అన్నారం సమీపంలో అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్లు ఆయనను హత్య చేయడం విషాదకరమైన ఘటన అని అన్నారు.
కార్యక్రమంలో అడిషన్ డీసీపీ ఏఆర్ కుమారస్వామి,
ఆర్ ఐలు అప్పలనాయుడు, శ్రీశైలం, సురేష్ పాల్గొన్నారు.