నేటి గదర్ వెబ్ డెస్క్:
హర్యానాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 ఏళ్ల యువ మహిళా నాయకురాలు హిమానీ నర్వాల్ అతి దారుణంగా హత్య చేయబడ్డారు. కొందరు గుర్తు తెలియని దుండగులు.. హిమానీ నర్వాల్‌ను దారుణంగా చంపేశారు. ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇక ఈ విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక హిమానీ నర్వాల్ మృతి పట్ల సంతాపం తెలిపిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్.. ఈ ఘోరంపై పూర్తి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. నిందితులను తొందర్లో గుర్తించి.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హర్యానా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
Post Views: 24