నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, మార్చ్, 06: దమ్మపేట మండలం, మొండివర్రె గ్రామపంచాయతీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపికై గ్రామపంచాయతీ పరిధిలో అర్హులైన నిరుపేదలందరికీ 5 లక్షలతో పక్కాఇండ్లు నిర్మించటానికి రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టిన సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం మొండివర్రెకాలనీలో బేతం రవి-నాగలక్ష్మి ఇంటికి భూమిపూజ సంఖుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డీఈ సుబ్రహ్మణ్యం, ఏఈ జి రాము, ఎంపీడీవో రవీంద్ర రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి, దమ్మపేట సొసైటీ చైర్మన్ యెళ్లిన రాఘవరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, మాజీ ఎంపీపీ సోయం ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, గ్రామ శాఖ కార్యవర్గ సభ్యులు, స్థానిక గ్రామస్తులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 47