+91 95819 05907

ఆపదలో ఆపద్బాంధవుడయ్యాడు….కామ్రేడ్. పోతినేని సుదర్శన్ రావు

★ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి

కాపాడి 108 కి సమాచారం అందించిన పోతినేని
నేటిగద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి,
బోనకల్
ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు అదే సమయంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు ఎర్రిపాలెం వెళ్తున్నారు. రోడ్డుపై తీవ్రంగా గాయపడి ప్రమాదకర పరిస్థితులో ఉండటంతో పోతినేని సుదర్శన్ రావు తన కారుని వెంటనే ఆపి 108 కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి 108 వచ్చేవరకు ఉండి 108 లో ఆ వ్యక్తిని ఎక్కించి ప్రాణాలను కాపాడిన సంఘటన మండల పరిధిలోని రావినూతల, జానకిపురం గ్రామాల మధ్యలో శుక్రవారం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం వైరా బీసీ కాలనీకి చెందిన కాశీమల్ల చార్లెస్ ఇటుక బట్టి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వైరా నుంచి తన మోటార్ సైకిల్ మీద కోదాడలో ఇటికబట్టి వద్దకు వెళుతున్నాడు. అయితే మండల పరిధిలోని జానకిపురం – రావినూతల మధ్య ప్రమాదవశాత్తు మోటార్ సైకిల్ కి బ్రేకులు పడకపోవడంతో తనకు తానే రోడ్డుపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు జిల్లా కార్యదర్శి సభ్యులు బండి రమేష్ మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు ఖమ్మం నుంచి ఎర్రుపాలెం వెళ్తున్నారు. రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న చార్లెస్ ను చూసి వెంటనే 108 కు సమాచారం అందించారు. 108 వచ్చేవరకు సంఘటన స్థలంలోనే వారు ఉండి అవసరమైన చర్యలను చేపట్టారు. 108 రాగానే స్వయంగా అతనిని పోతినేని సుదర్శన్ రావు, బండి రమేష్, మడిపల్లి గోపాల్ రావు 108 లో ఎక్కించి ప్రాణాల నుంచి కాపాడారు.108 లో చార్లెస్ ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు పాలై ప్రమాదకర స్థితిలో ఉన్న చార్లెస్ ని సకాలంలో స్పందించి 108 కి సమాచారం అందించడం వల్లనే ప్రాణాల నుంచి బయటపడినట్లు 108 సిబ్బంది తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మండలంలో పర్యటించిన టీజీ ఐడిసి చైర్మన్ మువ్వావిల్ విజయ్ బాబు, ఎమ్మెల్యే జారె

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, మార్చ్, 14: దమ్మపేట మండలంలో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దమ్మపేట మండలంలో పర్యటించి నాచారం

Read More »

ఐక్యత ప్రెస్ క్లబ్ సభ్యులు చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం -ఎమ్మెల్యే జారె

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 14: వేసవిలో మండల ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయటం అభినందనయంని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. శుక్రవారం మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్

Read More »

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి

◆ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపడుకుంటా ◆స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి -మాజీ ఎమ్మెల్యే మెచ్చా నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 14: నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ,

Read More »

హెడ్‌మాస్టర్‌ గుంజీలు తీసాడు. ఎక్కడంటే?

నేటి గదర్ వెబ్ డెస్క్: విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని హెడ్‌మాస్టర్‌ గుంజీలు విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని ఓ పాఠశాల హెడ్‌మాస్టర్‌ గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. తాము ఎంత చెప్పినా విద్యార్థుల్లో

Read More »

రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఆ రోజు ఒక చీకటి రోజు :రేగా

★రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి పిలుపు ★భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ

Read More »

తండ్రి కి మాత్రం ఆ కూతురు సమాధి కట్టింది అని చర్చ!!!!??

Idi nijama 🙌 మారుతి రావు కి అమృత అంటే ఏంత ఇష్టం అంటే చిన్నప్పుడు తను చదువుతున్న స్కూల్ లో టిచర్ లు ఏదో ఎగతాళి చెసారని స్కూల్ పక్కనే ఉన్న స్థలం

Read More »

 Don't Miss this News !