నేటి గద్దర్ న్యూస్,చింతకాని ప్రతినిధి,
ముదిగొండ మండలం మార్చి 7
ముదిగొండ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రెవిన్యూ మహిళా సిబ్బందిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ సునీతా ఎలిజబెత్ మాట్లాడుతూ సమాజంలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు మహిళ లేనిదే యావత్ సమాజం లేదన్నారు మహిళలను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు ఈ కార్యక్రమంలో నాయబ్ తహశీల్దార్ లక్ష్మీ, రెవిన్యూ ఇన్స్పెక్టర్ వహీదా సుల్తానా,ప్రసన్న కుమార్ రెవిన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు
Post Views: 29