రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 7:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం నాడు మండల ఎంపీడీవో షాజీలోద్దీన్ ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా మండల ఎంపీడీవో పాఠశాలలో మధ్యాహ్న భోజనం విద్యార్థులకు ఏ విధంగా అందిస్తున్నారన్న విషయంలో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలో వంటశాల గదిని మరియు బియ్యం స్టాక్ ను ఆయన పరిశీలించారు.రాబోయే పదవ తరగతి పరీక్షల కోసం విద్యార్థులు ఎలా చదువుతున్నారని వారితో సంభాషించారు.పదో తరగతి వార్షిక పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించి విద్యార్థులు పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు.విద్యార్థులకు సంబంధించిన పలు రికార్డులను పాఠశాలలో పరిశీలించారు.అదేవిధంగా వంటగదిలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు ప్రతిరోజు పరిశుభ్రతను పాటించాలని సూచించారు.
Post Views: 60