+91 95819 05907

రోడ్డు ప్రమాదంలో డీఎస్పీ మృతి

రోడ్డు ప్రమాదంలో డీఎస్పీ మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం లో చోటుచేసుకుంది. కుకునూర్ పల్లి ఎస్ఐ పి. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ వైస్ ప్రిన్సిపాల్ డీఎస్పీ బి.జవహర్ లాల్(50) సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని రాజ్ గోపాల్ పేట గ్రామ శివారులోని ఫైరింగ్ రేంజ్ లో ఇన్ సర్వీస్ కానిస్టేబుల్స్ కు నిర్వహించిన ఫైర్ టెస్టింగ్ ను పూర్తి చేసుకుని తిరిగి మేడ్చల్ కు కారులో వెళ్తున్నారు. మార్గమధ్యలో కుకునూర్ పల్లి మండలం చిన్నకిష్టాపూర్ చౌరస్తా వద్ద చిన్నకిష్టాపూర్ గ్రామం వైపు నుంచి వస్తున్న కారు ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వకుండా రాజీవ్ రహదారిపై హైదరాబాద్ వైపు తిప్పడంతో ఆ కారు ను తప్పించబోయి సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న అడ్వటైజ్మెంట్ బోర్డు ను ఢీకొట్టింది.

కారు లో ఉన్న మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ వైస్ ప్రిన్సిపాల్ డీఎస్పీ బి. జవహర్ తలకు, ఛాతీలో గాయాలు గాక కారు డ్రైవర్ కాళ్లకు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. వారి వెనుకే వస్తున్న మేడ్చల్ పి టి సీ సిబ్బంది వారిని ములుగు మండలంలోని లక్ష్మక్క పల్లి గ్రామ శివారు లోని ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ వైస్ ప్రిన్సిపాల్ డీఎస్పీ బి జవహర్ లాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

రుణమాఫీ చేసినందుకు ప్రజాపాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు, రైతులు

నేటి గదర్ న్యూస్, మార్చి 13, ఎర్రుపాలెం ప్రతినిధి సగ్గుర్తి ముత్యాల రావు, సెల్ ; 9502921891 ఎర్రుపాలెం రింగ్ సెంటర్ నందు ప్రజా ప్రభుత్వం ముఖ్యమం ప్రజా పాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన

Read More »

గ్రూప్ 2 ఉద్యోగాన్ని సాధించిన దేశినేనిపాలెం గ్రామవాసి

*శుభాకాంక్షలు తెలియజేసిన దేశనేనిపాలెం గ్రామ ప్రజలు…* 💐💐💐 గ్రూప్ -2 విజయం సాధించిన దేశీనేనిపాలెం గ్రామవాసి నేటి గదర్ న్యూస్, మార్చి 13, సగ్గుర్తి ముత్యాల రావు మధిర మండలం దేశినేనిపాలెం గ్రామానికి చెందిన

Read More »

3వ రోజుకు చేరుకున్న ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష

నిరంతరంగా మూడోరోజు కొనసాగుతున్న ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన ఎం.ఎఫ్ నాయకులు పార్శపు ఏనూక మాదిగ నేటి గదర్ న్యూస్, మార్చి 13. మధిర కేంద్రం తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా మహాజననేత

Read More »

ఆ వలస ఆదివాసి గ్రామంలో టీవీ యాంకర్లు సందడి చేశారు.మన గ్రోమోర్ ఆధ్వర్యంలో పల్లెకు పోదాం కార్యక్రమం

నేటి గదర్ న్యూస్,పినపాక: మండలంలోని గ్రామపంచాయతీ లోని తిల్లాపురం ఆదివాసి గ్రామంలో బిగ్ ఫేమస్ ఆర్టిస్టులు గీత రాయల్ శ్రీ సత్య పవిత్ర యాంకర్ అనిల్ జిలా గురువారం పర్యటించారు. మన గ్రోమోర్ ఆధ్వర్యంలో

Read More »

పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక

Read More »

భారత వాయుసేన అమ్ములపొద లోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్

Read More »

 Don't Miss this News !