శిశుమందిర్ విద్యాపీఠం మరింత అభివృద్ధి చెందాలి మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు
రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) 8:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని మెహర్ సాయి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన అశోక్ సింఘాల్ శిశుమందిర్ మూడవ వార్షికోత్సవ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు హాజరయ్యారు.మొదటగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలల్లో మెదక్ నియోజకవర్గాన్ని విద్య వైద్య పరంగా ఎంతోగానో అభివృద్ధి చేశామన్నారు.అలాగే మహిళా డిగ్రీ కళాశాల మరియు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలలు మంజూరు అయ్యి హాస్టళ్లను కూడా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.2021 సంవత్సరంలో ప్రారంభమైన సరస్వతి శిశు మందిర్ విద్యాపీఠం ఇపుడు శిశు నుంచి ఐదు తరగతుల వరకు విద్యార్థులతో విస్తరించి విద్యనందించడం గర్వంగా ఉందన్నారు.రాబోయే రోజుల్లో శిశుమందిర్ విద్యాపీఠం మరింత అభివృద్ధి చెంది చక్కటి విద్యను అందించే దిశగా విద్యార్థులతో కొనసాగించాలని ఆశిస్తున్నామని అన్నారు.ఈ విద్యాపీఠంలో విద్యార్థులకు చిన్ననాటి నుండి సంస్కృతం సంగీతం నృత్యాలు నేర్పిస్తున్న ఆచార్యుల బృందాన్ని అభినందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌదరి సుప్రభాత రావు,రమేష్ రెడ్డి మామిడి సిద్ధ రాములు,కంభంపాటి విప్లవ కుమార్,అల్లాడి వెంకటేష్ ఎనిశెట్టి అశోక్ గుప్తా,పోచమ్మల అశ్విని శ్రీనివాస్,మండల ఎంఈఓ శ్రీనివాస్, శిశు మందిర్ ప్రధాన ఆచార్యులు కవిత శిశు మందిర్ అధ్యక్ష కార్యదర్శులు పడకంటి సంగమేశ్వర్,పండరినాథ్ లు శిశు మందిర్ ఆచార్యుల బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.