రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 8:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకురాలు బాలమణి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలపై బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగిందన్నారు.మహిళలకు ఎక్కువ శాతం మన రామాయంపేట ఏరియాలో బీడీ కార్మికులు ఉన్నారని వారికి సరియైన పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.పనికి తగ్గట్టు వేతనాలు వారికి లేవన్నారు.నాలుగు సంవత్సరాల నుంచి పింఛన్లు రాలేదు.వృద్ధులు కూడా చాలామంది ఉన్నారు.వారికి కూడా పింఛన్లు లేవు బీడీలు చేసి చేసి వాళ్ళు ఆరోగ్యాలు బాగా లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.బీడీ కార్మికులకు ఉపాధి పని కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మల్లేశం సభాధ్యక్షురాలు బాలమణి పుష్ప,కవిత,మంజుల,అనిత లక్ష్మి,పద్మ,సుజాత తదితరులు పాల్గొన్నారు.
