భద్రాద్రి కొత్తగూడెం :
భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలో జిల్లా బీసీ కార్యాలయం నందు అట్టహాసంగా మహిళా దినోత్సవం జిల్లా అధ్యక్షులు మాడిశెట్టి శ్రీనివాస్, జాతీయ ప్రధాన కార్యదర్శి కొదుమూరు సత్యనారాయణ ఆధ్వర్యంలో బీసీ సంఘం లోని మహిళలని శాలువాలతో సత్కరించడం జరిగింది.
జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ 150 సంవత్సరాలు కిందట ఈ దేశంలో మహిళలు కేవలం వంటింటికి మాత్రమే పరిమితం అయ్యారని దానికి గల కారణం ఆనాడు ఉన్నటువంటి హిందూ మత చాందసవాదులు చదువులు నేర్పించలేదు ఈ యొక్క విషయాన్ని గ్రహించి మహాత్మ జ్యోతిరావు పూలే స్త్రీలను చదువు నేర్పించడం తన భార్య అయిన సావిత్రిబాయి పూలే తో విద్యాసంస్థల స్థాపించి విద్యాబుద్ధులు నేర్పించడం వలన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సనాతన బ్రాహ్మణవాదంపై పోరాటం చేసి అస్వృశ్యతను నివారింపజేశారు మహిళలకు అన్ని రంగాల్లో అభివృద్ధి కావడానికి రిజర్వేషన్లను ఏర్పాటు చేశారు మహిళలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఆస్తి హక్కులు పురుషులతో సమానంగా జీవించే విధంగా చట్టాలను రూపొందించి మహాత్ముల అయ్యారని పేర్కొన్నారు
జిల్లా ప్రధాన కార్యదర్శి భూపాతి శ్రీనివాసరావు స్త్రీల సమాన హక్కుల కోసం ప్రభుత్వాలపై పోరాటాలు చేయాలని మహిళలకు 50% రిజర్వేషన్ ని ఏర్పాటు చేస్తూ బిసి మహిళలకు సబ్ కోట ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో గు ములాపురంసత్యనారాయణ కొప్పుల రమేష్ శనిగల సత్యనారాయణ కుంచె లావణ్య బుర్ర జయమ్మ రేణుక రాజేశ్వరి పుష్ప లత కాసర్ల సుశీల రెంటపల్లి మాధవి లత తదితర మహిళలకు గౌరవంగా సన్మానించడం జరిగింది