*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, గుండాల మండల వాసవి క్లబ్, గ్రీన్ ఫీల్డ్ కార్యవర్గ నూతన కమిటీ సోమవారం రాత్రి ప్రమాణ స్వీకారం మహోత్సవం అట్టహాసంగా సాగింది. నూతన అధ్యక్షుడిగా మానాల శ్రవణ్ కుమార్,ప్రధాన కార్యదర్శిగా మానాల ఉపేందర్, ట్రెజరర్ గా గౌరిశెట్టి శరత్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్స్ మాజీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు . ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘము సీనియర్ నాయకులు మానాల నారాయమూర్తి చేతుల మీదుగా నూతన అధ్యక్షుడికి బ్యానర్, ప్రెసిడెంట్ కాలారు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు మరియు వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్స్ గుండాల సభ్యులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గానికి వాసవి క్లబ్ గవర్నర్ కొత్త వెంకటేశ్వర్లు గుండాల మండలంలోని రాజకీయ పార్టీ నాయకులు సేవా సంఘాలు అభినందనలు తెలిపారు.
