నేటి గద్దర్ డిజిటల్ న్యూస్, చింతకాని ప్రతినిధి,
చింతకాని మార్చి 09: మండల పరిధిలోని లచ్చగూడెం గ్రామంలో భారత రాష్ట్ర సమితి మండల కమిటీ ఆధ్వర్యంలో డైరీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య మాట్లాడుతూ ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలో ఉన్నాయని, సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ పూర్తిగా ఆ విఫలమైందని, సంక్షేమ పథకాల అమలు కొరకు ప్రజా పోరాటాలు నిర్వహిస్తామన్నారు.పార్టీ బలోపేతానికి రానున్న కాలంలో స్థానిక కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి మండల కార్యదర్శి బొడ్డు వెంకట్రామయ్య, హన్మంతరావు,మండల నాయకులు
మర్రి ప్రకాష్,వేముల నరసయ్య,గురజాల హనుమంతరావు,గడ్డం శ్రీను, కాళంగిడేవిడ్,షేక్ జావీద్,
చలమయ్య,షేక్ మదార్, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 29