నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి
చింతకాని మండలం తిమ్మినేనిపాలెం గ్రామానికి చెందిన నెమలికొండ. వెంకటేశ్వర్లు అను ఒక నిరుపేదకు “ఆకలి అందరిదీ” గ్రూప్ సభ్యుల ద్వారా వారికి అవసరమైన రెండు నెలలకు సరిపడా నిత్యవసర వస్తువులు,దుస్తులు,దుప్పట్లు, టవల్లు ను స్థానిక గ్రామ పెద్దలు, గ్రూప్ సభ్యుల చేతుల మీదుగా అందించడం జరిగింది….”ఆకలి అందరిదీ” గ్రూప్ చేస్తున్న కార్యక్రమం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం జరిగింది.భవిష్యత్తులో మరింత మందికి ఇలాంటి సహాయ, సహకారాలు అందించాలని అభిలషించారు..తాము కూడా తమ శక్తి మేర గ్రూప్ కు అవసరమయిన సహాయ, సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పెద్దలు,గ్రూప్ సభ్యులు,ప్రజలు పాల్గొన్నారు.
Post Views: 32