భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన పొన్నగంటి పురుషోత్తం అను రైతుకు చెందిన సుమారు 70 క్వింటాల మిరపకాయలను గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి తగలబెట్టారు. మిరపకల్లంలో గ్రేడ్ చేసి, కాయలను మార్కెట్ కు వెళ్లి అమ్ముకుందామనుకుంటున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని బాధిత రైతు కుటుంబం బోరున విలపించింది.
Post Views: 13