+91 95819 05907

సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.

ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన చైతన్య మూర్తి సావిత్రిబాయి పూలే.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.

సావిత్రి భాయ్ పూలే వర్ధంతి సందర్భంగా ప్రవీలియన్ గ్రౌండ్ సమీపంలో ఉన్న సవత్రి భాయ్ పూలె ఆమె విగ్రహానికి పి డి ఎస్ యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పి డి ఎస్ యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన చైతన్య మూర్తి సమాజంలో రుగ్మతలు రూపుమాపడానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి మొదటి ఉపాధ్యాయుని శ్రీమతి సావిత్రిబాయి పూలే గారని అన్నారు.చిన్న వయసులోనే బాల్యవివాహం జరిగిన ఆమె ఉన్నత భావాలతో భర్త సహకారంతో చదువుకొని అందరికీ చదువు చెబుతూ ఆదర్శం అయ్యారన్నారు.

స్త్రీలు వంట ఇంటికి పరిమితం కావాలని గడప దాటి బయటికి వచ్చే స్వేచ్ఛను 18వ శతాబ్దంలో మనువాద ధర్మం కల్పించలేదు అటువంటి అణచివేతలకు, అసమానతలకు ,అంటరాని, అస్పృశ్యతలకు వ్యతిరేకంగా ఆనాడు సావిత్రి భాయి పూలే స్త్రీలకు అనేక అవగాహన కార్యక్రమాలు కల్పించి,వారిని చైతన్య పరిచారని మనువాద ధర్మాన్ని సమాధి చేస్తూ మహిళలు అన్నిటిలో సమానులే అని ఎలుగెత్తి చాటి చెప్పి వారికి విద్యను అందించారని, భారతదేశంలో మొట్టమొదటి వెనకబడ్డ తరగతులకు పాఠశాల ప్రారంభించి వారికి విద్యను అందించిన చరిత సావిత్రిబాయి పూలేదని వారి సందర్భంగా కొనియాడారు భారత దేశంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక అసమానతలు మరియు నాణ్యతలేని విద్యా ప్రమాణాలు రేపటి తరానికి తీవ్ర నష్టం చేకూరుస్తాయని వీటికి వ్యతిరేకంగా నేటి తరం విద్యార్థులు, యువకులు పోరాడాలని అదే సావిత్రిబాయికి మనం ఇచ్చే నిజమైన ఘన నివాళి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ జిల్లా నాయకులు వినయ్ , తిరుపతి రావు అలేఖ్య, స్పందన, శిరీష, ప్రియాంక, ఝాన్సీ, ఉష, శైలజ తదితర నాయకులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్… అక్రమ అరెస్టు పట్ల మండిపడ్డ ప్రతిపక్షాలు, సీనియర్ జర్నలిస్టులు

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: ప్రముఖ యూట్యూబ్ ఛానల్ మహిళా జర్నలిస్ట్ రేవతిని సిసిఎస్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని జర్నలిస్ట్ రేవతి సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Read More »

ఉద్యమకారుడు, విద్యావంతుడు అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్సీ పదవి ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన తోటమల్ల

చర్ల: మార్చి :12 తెలంగాణ రాష్ట్ర మాలమహానాడు వ్యవస్థాపకులు డా. అద్దంకి దయాకర్ ను ఎమ్మెల్సీ గా పేరు ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తోటమల్ల వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ

Read More »

అన్నం సేవా ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం

◆అన్నం పరబ్రహ్మ స్వరూపిణి నేటి గదర్ న్యూస్, ఖమ్మం : చి.కడవెండి శ్రీ చక్రధర్ – చి.ల.సౌ.హాసిక ల వివాహ మహోత్సవం సందర్భంగా మంగళవారం రోజు డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ అనాధల ఆశ్రమంలో

Read More »

దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలి: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

తాడ్వాయి మండలం. ములుగు జిల్లా. దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. మంగళవారం ఎస్ ఎస్ తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో రాష్ట్ర

Read More »

వైరా: వృద్ధురాలి మెడలో బంగారం చోరి… నిందితుల అరెస్ట్

★వైరా లో సంచలనం సృష్టించిన కేసు చేదించిన పోలీసులు ★ పోలీస్ సిబ్బందిని అభినందించిన వైరా ఏసిపి రెహమాన్ నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి, మార్చి 11:- గత ఫిబ్రవరి 12వ తేదీన

Read More »

 Don't Miss this News !