ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన చైతన్య మూర్తి సావిత్రిబాయి పూలే.
నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
సావిత్రి భాయ్ పూలే వర్ధంతి సందర్భంగా ప్రవీలియన్ గ్రౌండ్ సమీపంలో ఉన్న సవత్రి భాయ్ పూలె ఆమె విగ్రహానికి పి డి ఎస్ యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పి డి ఎస్ యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన చైతన్య మూర్తి సమాజంలో రుగ్మతలు రూపుమాపడానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి మొదటి ఉపాధ్యాయుని శ్రీమతి సావిత్రిబాయి పూలే గారని అన్నారు.చిన్న వయసులోనే బాల్యవివాహం జరిగిన ఆమె ఉన్నత భావాలతో భర్త సహకారంతో చదువుకొని అందరికీ చదువు చెబుతూ ఆదర్శం అయ్యారన్నారు.
స్త్రీలు వంట ఇంటికి పరిమితం కావాలని గడప దాటి బయటికి వచ్చే స్వేచ్ఛను 18వ శతాబ్దంలో మనువాద ధర్మం కల్పించలేదు అటువంటి అణచివేతలకు, అసమానతలకు ,అంటరాని, అస్పృశ్యతలకు వ్యతిరేకంగా ఆనాడు సావిత్రి భాయి పూలే స్త్రీలకు అనేక అవగాహన కార్యక్రమాలు కల్పించి,వారిని చైతన్య పరిచారని మనువాద ధర్మాన్ని సమాధి చేస్తూ మహిళలు అన్నిటిలో సమానులే అని ఎలుగెత్తి చాటి చెప్పి వారికి విద్యను అందించారని, భారతదేశంలో మొట్టమొదటి వెనకబడ్డ తరగతులకు పాఠశాల ప్రారంభించి వారికి విద్యను అందించిన చరిత సావిత్రిబాయి పూలేదని వారి సందర్భంగా కొనియాడారు భారత దేశంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక అసమానతలు మరియు నాణ్యతలేని విద్యా ప్రమాణాలు రేపటి తరానికి తీవ్ర నష్టం చేకూరుస్తాయని వీటికి వ్యతిరేకంగా నేటి తరం విద్యార్థులు, యువకులు పోరాడాలని అదే సావిత్రిబాయికి మనం ఇచ్చే నిజమైన ఘన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ జిల్లా నాయకులు వినయ్ , తిరుపతి రావు అలేఖ్య, స్పందన, శిరీష, ప్రియాంక, ఝాన్సీ, ఉష, శైలజ తదితర నాయకులు పాల్గొన్నారు.