+91 95819 05907

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా అప్ గ్రేడ్ చేయాలి

●మాజీ పార్లమెంట్ సభ్యులు మీడియం బాబురావు

●ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన సిపిఐఎం బృందం

నేటి గదర్ న్యూస్, భద్రాచలం :

నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం లో ఉన్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయాలని మాజీ పార్లమెంట్ సభ్యులు మీడియం బాబురావు కోరారు. సోమవారం మీడియం బాబురావు నేతృత్వంలో సిపిఐఎం బృందం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సదుపాయం పై ఆరా తీశారు అనంతరం ఆసుపత్రి సమస్యలపై ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ ముదిగొండ రామకృష్ణాతో మాట్లాడి ఆస్పత్రిలో కావలసిన ఎక్యుమెంట్స్ సిబ్బంది కొరత తదితరు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా డాక్టర్ మీడియం బాబురావు మాట్లాడుతూ భద్రాచలం ఆసుపత్రి నాలుగు రాష్ట్రాల అంతర్రాష్ట్ర ఆసుపత్రిగా ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గడ్ ,తెలంగాణ, రాష్ట్ర నలుమూలల నుండి ముఖ్యంగా గిరిజన ప్రాంతమైనందున ఎక్కువ మంది గిరిజనులు పేదలు బలహీన వర్గాలకు సంబంధించిన వారు ఈ ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు పొందుతున్నారని అన్నారు. గతంలో ఈ హాస్పటల్ కేవలం 30 పడకలతో నిర్మించి ఉండగా ఆనాడు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కుంజా బుజ్జి దానిని వంద పడకల ఆసుపత్రిగా రూపొందించారని ఆ తరువాత తాను ఎంపీగా పనిచేసిన కాలంలో తన నిధులతో ఐసీయూ బ్లాక్ నీ ఏర్పాటు చేయటం జరిగినదని 20 14 తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి సున్నం రాజయ్య పట్టుబట్టి 200 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయించడం జరిగినదని గుర్తు చేశారు. భద్రాచలం ఏరియా హాస్పిటల్ అంటే రాష్ట్రంలోనే పేరు ప్రతిష్టలు గలదని అనేక అవార్డులు రివార్డులు తెచ్చుకుని మంచి పేరు ప్రతిష్టలు పొందిన ఈ హాస్పటల్లో నేడు ఉన్న పరిస్థితులు చూస్తే దయనీయంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆసుపత్రిలో ఉండవలసిన డాక్టర్లు 37 మందికి గాను కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారని సివిల్ సర్జన్లు అలాగే సర్జన్స్ 9 మంది గాను ముగ్గురే ఉన్నారని అలాగే ఇతర సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో లేదని స్టాప్ నర్సులతోపాటు భాగాల్లో పనిచేసే స్టాప్ లేకపోవటం వల్ల అనేకమైనటువంటి పరికరాలు నిరుపయోగంగా పడి ఉన్నాయని అన్నారు. ఈ హాస్పిటల్ కి ప్రతిరోజు 500 మంది తగ్గకుండా ఓపి రోగులు వస్తుంటారని అలాగే నెలకు 1500 నుంచి 1600 మంది ఇన్ పేషెంట్లుగా ఉంటున్నారని పదిమంది ఐసీయూలో ఉండే అవకాశం ,ఎన్ఆర్సి సెంటర్, ఇతర ఎక్స్రే ల్యాబ్లు, అనేకమైనటువంటి సదుపాయాలు ఉన్నప్పటికీ తగిన శానిటరీ సిబ్బంది గాని పేషెంట్ కేర్ సిబ్బంది గానీ ఇతర విభాగాల్లో పనిచేసే స్పెషలిస్టు డాక్టర్ గాని లేకపోవడం వలన కేవలం ఓపి కి మాత్రమే పరిమితం అవుతున్నదని తెలిపారు. సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం వల్ల అనేకమంది ఇతర ప్రాంతాల ఆసుపత్రికి ,ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళటం జరుగుతున్నదని కావున ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే తెల్లo వెంకటరావు ఎంపీ బలరాం నాయక్ ఈ ఆసుపత్రి పై దృష్టి పెట్టి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. హాస్పిటల్ లో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి మరియు తెలంగాణ వైద్య విధాన పరిషత్ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ దృష్టికి లేఖలు రాసి అనంతరం వారిని స్వయంగా కలిసి ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని మీడియం బాబురావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు, వైవి రామారావు, పి సంతోష్ ,పట్టణ కమిటీ సభ్యులు, ధనకొండ రాఘవయ్య భూ పేందర్, మరియు రవి తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అన్నం సేవా ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం

◆అన్నం పరబ్రహ్మ స్వరూపిణి నేటి గదర్ న్యూస్, ఖమ్మం : చి.కడవెండి శ్రీ చక్రధర్ – చి.ల.సౌ.హాసిక ల వివాహ మహోత్సవం సందర్భంగా మంగళవారం రోజు డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ అనాధల ఆశ్రమంలో

Read More »

దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలి: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

తాడ్వాయి మండలం. ములుగు జిల్లా. దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. మంగళవారం ఎస్ ఎస్ తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో రాష్ట్ర

Read More »

వైరా: వృద్ధురాలి మెడలో బంగారం చోరి… నిందితుల అరెస్ట్

★వైరా లో సంచలనం సృష్టించిన కేసు చేదించిన పోలీసులు ★ పోలీస్ సిబ్బందిని అభినందించిన వైరా ఏసిపి రెహమాన్ నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి, మార్చి 11:- గత ఫిబ్రవరి 12వ తేదీన

Read More »

జగన్నాధపురం – గోకినపల్లి R&B రోడ్డు విస్తరణ కొరకు 25 కోట్ల నిధులు కేటాయించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి జగన్నాధపురం నుండి గోకినపల్లి వరకు 19 కిలోమీటర్ల మేర విస్తరించిన R&B రహదారి అభివృద్ధిలో భాగంగా మత్కేపల్లి-జగన్నాధపురం R&B రోడ్డు నుండి మత్కేపల్లి గ్రామం మున్నేరు నది

Read More »

14 నెలలోనే మెదక్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చా: ఎమ్మెల్యే మైనంపల్లి

*పది సంవత్సరాల లో చేయని అభివృద్ధిని మెదక్ నియోజకవర్గంలో 14 నెలలలోనే మెదక్ ను ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయడం జరుగుతుందని విద్య వైద్యానికి ప్రాముఖ్యత ఇస్తూ మెరుగుపరచడం జరుగుతుంది.* మెదక్

Read More »

జీవితంపై విరక్తి చెంది యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 11:- మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మంగళవారం నాడు వట్టపు స్వామి వయస్సు (32) సంవత్సరాలు వృత్తి వ్యవసాయం తండ్రి ఆగమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు

Read More »

 Don't Miss this News !