ఖమ్మం : మాతా సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మహాత్మా పూలే ప్రాంగణంలో గల పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది . ఈ సందర్భంగా చైర్మన్ పెరుగు వెంకటరమణ యాదవ్ మాట్లాడుతూ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో బీసీల హక్కుల కోసం కొట్లాట చేస్తున్నామని , రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ కల్పించడం హర్షనీయమని తెలిపారు . కేంద్ర ప్రభుత్వం వెంటనే 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో చీఫ్ అడ్వైజర్ చేకూరి చైతన్య , జి నరేందర్ , తీగల రాము , చల్ల హనుమంతు , బీసీ నాయకురాలు చంద్రకాని రమ , గరిడేపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు .
Post Views: 20