నేటిగదర్ న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి మార్చి10:- వీర నారీమణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో సావిత్రీబాయి పులే వర్ధంతినీ ఘనంగా జరుపుకున్నారు. ఖమ్మం నగరం లోని కిమ్స్ హాస్పటల్ సమీపంలోని కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి పుల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్యా ఉపేంద్ర బాయి మాట్లాడుతూ.. మహిళల కోసం అహర్నిశలు పాటుపడి, పురుషులతో పాటు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలి. పోరాడిన సావిత్రి బాయి పులే పేరుతో ప్రతి జిల్లా కేంద్రంలో అధ్యయనం కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సావిత్రీబాయి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని అన్నారు. జయంతి, వర్దంతులను కూడా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని సూచించారు. సావిత్రీబాయి చిత్రపటాలు ప్రతి ప్రభుత్వ కార్యాలయం లో ఉండేలా ప్రభుత్వం ఓ సర్కులర్ జారీ చేయాలన్నారు. మహిళా చట్టాలను పటిష్ఠంగా అమలు చేయడమే సావిత్రీబాయి కి అర్పించే నిజమైన నివాళి అని ఉపేంద్రబాయి అన్నారు. అనంతరంవీరణరీమణుల ఆశయ సాధన సమితి జిల్లా కార్యదర్శి కె. స్పందన మాట్లాడుతూ.. మహిళలకు దక్కాల్సిన రిజర్వేషన్ కోటను అమలుచేసి, రాజకీయ, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అనేక అవకాలు కల్పించేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు భూక్యా జ్యోతి, ప్రధానకార్యదర్శి విజయ, సహాయ కార్యదర్శి ప్రియాంక, అధికార ప్రతినిధి పి. లక్ష్మి, ఆ సంఘం నాయకురాలు ఝాన్సి, సుభద్ర, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
