+91 95819 05907

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి (బుధవారం) నుంచి మొదలుకానున్నాయి

2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్​తో పాటు కీలక బిల్లు లను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీసీల 42 శాతం రిజర్వేషన్ల బిల్లులు, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సభ ఆమోదం తీసుకోనున్నారు. ఈ నెల 12న తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి.. గవర్నర్​ ప్రసంగం ఉంటుంది. గవర్నర్​ ప్రసంగంపై మరుసటిరోజు ధన్యవాద తీర్మానం ఉంటుంది. 14న హోలీ కావడంతో సభ జరగదు. ఒకవేళ ధన్యవాద తీర్మానం చర్చ కౌన్సిల్​లో పూర్తికాకపోతే 15న కూడా దానిపై చర్చించే చాన్స్​ ఉంది. 17న ఎస్సీ వర్గీకరణ బిల్లుపై, 18న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులపై అసెంబ్లీలో చర్చించి ఆమోదం తీసుకుంటారని సమాచారం. ఈ నెల 19న రాష్ట్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత పద్దులపై చర్చించనున్నారు. నెలఖారు వరకు బడ్జెట్​ సమావేశాలు కొనసాగించనున్నట్లు సమాచారం. ఒకవేళ రాష్ట్ర బడ్జెట్​ను 17న పెడితే.. చివరలో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులు పెట్టే అవకాశం ఉంటుంది. బీఏసీ సమావేశంలో చర్చించిన తరువాత సభ నిర్వహించే రోజులపై పూర్తి క్లారిటీ రానుంది.

*బీసీ, ఎస్సీ ఎజెండాతో ప్రభుత్వం..ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు*
బడ్జెట్​ సమావేశాలు ఈసారి గరం గరంగా సాగనున్నట్లు తెలుస్తున్నది. మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్​ కూడా సభకు హాజరవుతానని సంకేతాలు పంపించారు. దీంతో మొత్తం బడ్జెట్​ సమావేశాలు పూర్తయ్యే వరకు రోజూ ఆయన వస్తారా లేక ఒకటి, రెండు రోజులు మాత్రమే వస్తారా? అనేదానిపై క్లారిటీ లేదు. ప్రతిష్టాత్మకమైన 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లులతో పాటు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించనుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో సభలో వ్యవహరించనున్నట్లు తెలుస్తున్నది. ఇందుకోసం గత ప్రభుత్వం పదేండ్లలో బీసీలు, ఎస్సీలకు ఏం చేసిందనే దానిపై బీఆర్​ఎస్​ను ఎండగట్టనుంది. దేశవ్యాప్తంగా కులగణన చేసి బీసీలకు తగిన విధంగా రిజర్వేషన్లు కల్పించాలని బీజేపీని కార్నర్​ చేయనుంది. సాగు, తాగునీటితో పాటు రుణమాఫీ, రైతు భరోసా, గురుకులాలు, గ్యారంటీల అమలుపై అధికార పక్షాన్ని ప్రతిపక్షాలు ఇరుకునపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్… అక్రమ అరెస్టు పట్ల మండిపడ్డ ప్రతిపక్షాలు, సీనియర్ జర్నలిస్టులు

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: ప్రముఖ యూట్యూబ్ ఛానల్ మహిళా జర్నలిస్ట్ రేవతిని సిసిఎస్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని జర్నలిస్ట్ రేవతి సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Read More »

ఉద్యమకారుడు, విద్యావంతుడు అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్సీ పదవి ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన తోటమల్ల

చర్ల: మార్చి :12 తెలంగాణ రాష్ట్ర మాలమహానాడు వ్యవస్థాపకులు డా. అద్దంకి దయాకర్ ను ఎమ్మెల్సీ గా పేరు ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తోటమల్ల వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ

Read More »

అన్నం సేవా ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం

◆అన్నం పరబ్రహ్మ స్వరూపిణి నేటి గదర్ న్యూస్, ఖమ్మం : చి.కడవెండి శ్రీ చక్రధర్ – చి.ల.సౌ.హాసిక ల వివాహ మహోత్సవం సందర్భంగా మంగళవారం రోజు డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ అనాధల ఆశ్రమంలో

Read More »

దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలి: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

తాడ్వాయి మండలం. ములుగు జిల్లా. దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. మంగళవారం ఎస్ ఎస్ తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో రాష్ట్ర

Read More »

వైరా: వృద్ధురాలి మెడలో బంగారం చోరి… నిందితుల అరెస్ట్

★వైరా లో సంచలనం సృష్టించిన కేసు చేదించిన పోలీసులు ★ పోలీస్ సిబ్బందిని అభినందించిన వైరా ఏసిపి రెహమాన్ నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి, మార్చి 11:- గత ఫిబ్రవరి 12వ తేదీన

Read More »

 Don't Miss this News !