-ఈ బయ్యారం ఎస్ఐ రాజ్ కుమార్
నేటి గదర్ న్యూజ్,పినపాక:పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు లో ఏడూళ్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుల బయ్యారం క్రాస్ రోడ్ లోని షాప్ నిర్వాహకులకు ఎస్ఐ హెచ్చరికలు జారీ చేశారు. ఆర్ అండ్ బి నిబంధనల మేరకు
రోడ్డు కొలతలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు, ఇతర దుకాణాలు వెంటనే తొలగించాలని ఈ.బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ ఆదేశించారు. వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని తెలియజేశారు. రోడ్డుకిరువైపులా డ్రైనేజీ వరకు ఎటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. దుకాణదారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 381