నేటి గదర్ న్యూస్, నిజామాబాద్:
పద్మశ్రీ మహాజననేత మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు
ఈరోజు రెంజల్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరసన దీక్షలు కిన్నెర మోహన్ మండల ఎమ్మార్పీస్ అధ్యక్షులు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది.
సుప్రీం కోర్ట్ తీర్పు వచ్చిన రోజే నిండు శాసన సభలో మాటిచ్చారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడుతాం అని చెప్పి.. దానికి విరుద్ధంగా ఫలితాలు ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
*వర్గీకరణ పూర్తయ్యేవరకు అన్ని రకాల ఉద్యోగ నియామకాలను ఆపాలి..*
మాదిగలకు తీవ్ర అన్యాయం చేసేలాగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
షమీమ్ అక్తర్ నివేదిక లో అనేక లోపాలున్నాయి.. అవి మాదిగ కులాలకు శాపంగా మారనున్నాయి.లోపాలను సరిచేయాలి…
ఈరోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు మండల కేంద్రాల్లో దీక్షలు కొనసాగుతాయి.
ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు అన్ని రకాల ఉద్యోగాల భర్తీ నిలుపుదల చేయాలని డిమాండ్..
ఈ యొక్క దీక్షలో MRPS జిల్లా ప్రధాన కార్యదర్శి లసింగారి భూమయ్య మాదిగ, ఎమ్మార్పీ జిల్లా సహాయ కార్యదర్శి బండారి పోశెట్టి మాదిగ, ఎమ్మెస్పి నాయకులు జాధవ్ ఫకిర నాయక్, బండారి భూమన్న, బంటు సాయిలు, బండారి సాయిలు, బొమ్మ పోశెట్టి, బొమ్మ వడ్డెన్న, డప్పు గంగారా0, తాడే0 అబ్బయ్య, బండారి అశోక్, బండారి రాములు ,భూమన్న తదితరులు పాల్గొన్నారు.
దీక్షలను సందర్శించిన ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు, యమునా సత్య అక్క.
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సామాజిక న్యాయం అంటూ మద్దతిచ్చి సంఘీభావం ప్రకటించిన VHPS మండల అధ్యక్షులు సాయన్న,సిపిఎంఎల్ రెంజల్ మండలం ప్రధాన కార్యదర్శి నసీర్.