నేటి గదర్ న్యూస్,కరకగూడెం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం 108 అంబులెన్స్ లో ఈ.ఎం.టి గా పనిచేస్తూ డిసెంబర్ 13 న దోమల ప్రణయ్ మరణించడం జరిగింది. తెలంగాణ 108 స్టేట్ హెడ్ ఆపరేషన్స్ MA ఖాలీద్ గారు తెలిపిన వివరాల ప్రకారం విధి నిర్వహణలో భాగంగా ఏ ఉద్యోగస్తుడైన ప్రాణాలు కోల్పోతే వారికి ఈ.ఎం.ఆర్.ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ నుండి బాధిత కుటుంబాలకు కంపెనీ నుంచి 5 లక్షల రూపాయలను ఇస్తుందని అన్నారు ఈ అమౌంట్ ను ఉద్యోగస్తుల నామినీకి అందజేస్తామని తెలిపారు ఇటీవల కాలంలో మరణించిన 108 ఈ.ఎం.టి గా పనిచేసిన దోమల ప్రణయ్ కుటుంబానికి అండగా నిలిచి ఇట్టి అమౌంట్ కు సంబంధించిన చెక్కును స్టేట్ హెడ్ ఆపరేషన్స్ MA ఖాలీద్ గారు మరియు హెచ్ ఆర్ హెడ్ కిరణ్ కిషోర్ గారు ఈ రోజు సంస్థ ముఖ్య కార్యాలయంలో దోమల ప్రణయ్ కుటుంబ సభ్యులకు 5 లక్షల చెక్కును అందజేయడం జరిగింది.
కంపెనీ వారికి దోమల ప్రణయ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు