+91 95819 05907

ఆయకట్టు చివరి భూములకు సాగు నీరు అందించాలి :తెలంగాణ రైతు సంఘం

వార బంధీ సడలించి ఆయకట్టు చివరి భూములకు సాగు నీరు అందించాలి.

ధాన్యం బోనస్, రుణమాఫీ, రైతు భరోసా పెండింగ్ విడుదల చేయాలి.
మిర్చి మద్దతు ధర క్వింటాకు రూ 25 వేల రూపాయలు
ఖమ్మం లో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలి.

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి
తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు వినతి పత్రం

నేటిగదర్ న్యూస్, వైరా,మార్చి 11:- ఖమ్మం జిల్లా లో మిర్చి బోర్డు ఏర్పాటు కు చొరవ చూపాలి అని, మిర్చి క్వింటాళ్ల కు ఇరవై ఐదు వేల రూపాయలు మద్దతు ధర నిర్ణయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నా ఫెడ్ మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి అని కోరుతూ మంగళవారం వైరా మండలం పుణ్యపురం గ్రామం లో ఇందిరమ్మ ఇళ్లు శుకుస్తాపన కార్యక్రమం కు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పోంగులేటి శ్రీనివాస రెడ్డి కి తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ఖమ్మం జిల్లా లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి వివరించారు. ఖమ్మం జిల్లా లో 80 వేల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అని, గత రెండు సీజన్లో మిర్చి క్వింటాళ్ల కు ఇరవై ఐదు వేల రూపాయలు ధర ఉంటే నేడు 12, 13 వేల రూపాయలు ధర మాత్రమే రైతులు పొందుతూ ఉన్నారు అని అన్నారు.మిర్చి ఎగుమతులు , దేశీయ అవసరాలు, నూతన వంగడాలు పై తెగుళ్లు వైరస్ ల పై పరిశోధనలు సమగ్ర విధానం కోసం దేశంలో అత్యధిక విస్తీర్ణంలో మిర్చి సాగు అవుతు నాణ్యమైన మిర్చి దిగుబడులు సాధించిన ఖమ్మం జిల్లా లో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు వైరా మండలం లో సన్న రకాల ధాన్యం బోనస్ 3000 మంది రైతులకు 9 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉందని ఖమ్మం జిల్లా లో 23,345, మంది రైతులకు 65 కోట్ల రూపాయలు పెండింగ్ ఉందని వివరించారు, రుణమాఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది అన్నారు, రైతు భరోసా అలస్యం అవుతుంది అని అన్నారు ఖమ్మం జిల్లా లో సాగర్ ఆయకట్టు పరిధిలో,ఇతర ప్రాజెక్టులు పరిధిలో వారబంధి ఎత్తివేసిన ఆయకట్టు పరిధిలో చివరి భూములకు సాగు నీరు అందించి పంటలు ఎండిపోకుండా కాపాడాలి అని విజ్ఞప్తి చేశారు.
సిరిపురం –పుణ్యపురం కుర్నవల్లి లింక్ రోడ్డు బిటి రోడ్డు చేయాలని కోరారు
మంత్రి పోంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ
రైతుల సమస్యలు పరిష్కారం చేయుటకు తనవంతు ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు బాణాల శ్రీనివాసరావు,సిఐటియు జిల్లా నాయకులు తోట నాగేశ్వరరావు,మాజీ సర్పంచ్ పారుపల్లి కృష్ణారావు,కట్టా దుర్గయ్య, చలపతి రెడ్డి,అయిలూరి శేషు రెడ్డి,వడ్లమూడి మధు, అమరనేని కృష్ణ, మాడపాటి రాజేష్, రైతులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కొత్తగూడెం & కార్పొరేట్ ప్రాంతాలకు ప్యానల్ అడ్వకేట్‌గా వెల్లంకి వెంకటేశ్వరరావు నియామకం

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) దేశంలోని అతిపెద్ద కోల్ మైనింగ్ సంస్థల్లో ఒకటిగా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తోంది. వేలాది మంది కార్మికులకు ఉపాధి

Read More »

పినపాక మండలం తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షులుగా బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి నియామకం

పినపాక మండలం ఈ. బయ్యారం గ్రామానికి చెందిన తెలంగాణ జన సమితి పార్టీ మండల నాయకులు బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి గారిని పినపాక మండల నూతన తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షుడిగా

Read More »

హొలీ సందర్భంగా హైదరాబాద్ సిటీ వాసులకు పోలీస్ సూచన ఇదే

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: రంగుల ఖేలి హోళి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ సిటీ వాసులకు పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేశారు. హోలీ పండుగ సందర్భంగా పేర్కొన్న నిషేధాలు అమలులో ఉంటాయన్నారు. 2025 మార్చి

Read More »

రక్త దాన శిబిరం విజయవంతం

*శ్రీరామ ఆగ్రో సర్వీసెస్ వారు మెగా సర్వీస్ క్యాంప్ తో పాటు భద్రాద్రి బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ వారి సహకారంతో సంకల్ప వాలంటరీ ఆర్గనైజేషన్ వారితో రక్త దాన శిబిరం విజయవంతం* భద్రాద్రి కొత్తగూడెం

Read More »

ఆత్కూరు నుండి మధిర, బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

నేటి గదర్ న్యూస్, మార్చి 12 మధిర నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిన మధిర నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రివర్యులు

Read More »

 Don't Miss this News !