హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 11.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ముద్దాపూర్ గ్రామంలో ముత్యాల పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలలో భాగంగా మంగళవారం అమ్మవారి బోనాల కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి మహిళలతో కలసి భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. అనంతరం పోచమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ముద్దాపూర్ గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని పోచమ్మ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, తాజా మాజీ సర్పంచ్ లు, కురుమూర్తి గౌడ్, దానయ్య,లింగారెడ్డి,బద్రి. మల్లేశం శ్రీనాథ్ రావు,ఎంపీటీసీల ఫోరమ్ మాజీ అధ్యక్షులు. వడ్ల కుబేర్.నాయకులు. సాయి రెడ్డి. సొంగ దుర్గయ్య. ఏడుపాయల దేవస్థానం మాజీ ధర్మకర్తలు నాగప్ప,దుర్గయ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.