రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 11:- మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మంగళవారం నాడు వట్టపు స్వామి వయస్సు (32) సంవత్సరాలు వృత్తి వ్యవసాయం తండ్రి ఆగమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మూడు సంవత్సరాల కిందట వడియారం గ్రామానికి చెందిన శిరీషతో ఇతనికి వివాహం అయింది. సంతానము లేదు సంతానం లేకపోవడంతో భార్యాభర్తల మధ్యలో అప్పుడప్పుడు గొడవలు జరుగుతుండేవి.9 నెలల క్రితం తన భార్య తల్లిగారింటికి వెళ్లిపోయింది. ఈ విషయంలో పెద్దమనుషులను తీసుకెళ్లి సముదాయించి మాట్లాడి తీసుకొచ్చారు.20 రోజుల క్రితం మరల వడియారం శిరీష తన అన్న చావుకు వెళ్లి వడియారంలో అక్కడే ఉండడంతో భార్య కాపురానికి రాకపోవడంతో వట్టెపు స్వామి ఒంటరితనంతో మనస్థాపం చెంది జీవితంపై విరక్తి చెందాడు.ఉదయం 5 గంటల ప్రాంతంలో వల్లూరు ప్రాంతంలో ఒక చెట్టుకు నైలాన్ తాడుతో ఉరివేసు కుంటున్నానని తన తమ్ముడికి శ్రీకాంత్ ఫోన్ చేసి చెప్పి ఉరి వేసుకొని చనిపోయాడు.తమ్ముడు శ్రీకాంత్ తన తండ్రిని తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా అక్కడ ఉరివేసుకొని తన అన్న కనిపించడంతో ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకు చేరవేయగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తము రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.తండ్రి ఆగమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
