★ఏటా రూ.12 వేల చొప్పున భృతి ఇవ్వాలి… కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి*
■ఆటో కార్మికుల భరోసాగా… తెలంగాణ జన సమితి పార్టీ*
★ఆటో కార్మికుల బాధ్యత ప్రభుత్వానిదే… పినపాక మండల తెలంగాణ జన సమితి మండల అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి
నేటి గదర్ న్యూస్,పినపాక:
పినపాక మండలం ఈ. బయ్యారం క్రాస్ రోడ్ లోని ఆటో అడ్డాను పినపాక మండలం తెలంగాణ జన సమితి మండల అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర రెడ్డి బుధవారం నాడు సందర్శించి ఆయన ఆటో కార్మికులతో కాసేపు మాట్లాడటం జరిగింది వారు కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో అన్ని విధాలుగా నష్టపోయిన ఆటో కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు, ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు, ఎన్నికల ముందర ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఆటో డ్రైవర్లు క్రియేటర్ 12000 బృతి ఇవ్వాలని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతి జిల్లా కేంద్రంలో ఆటోనగర్ నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు,
ఈ కార్యక్రమంలో రాము కన్నయ్య సురేందర్ శంకర్ ప్రసాదు సతీష్ శ్రీను, ఆటో కార్మికులు తదితరులు ఉన్నారు.