ఎమ్మార్పీఎస్ మరియు దళిత సంఘాల నాయకుల డిమాండ్.
హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మే 17.
మెదక్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనం తక్షణమే నిర్మించాలని లేకుంటే మెదక్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద దళిత సంఘాల నాయకుల మహా ధర్నా నిరసన నిర్వహిస్తామన్నారు. అనంతరం ఎమ్మార్పీఎస్,మాల మహానాడు, డిబిఎఫ్ మెదక్ జిల్లా ఇతర దళిత సంఘాలు ఈరోజు టిఎన్జీవో భవనంలో సమావేశం సందర్భంగా నాయకులు మాట్లాడుతూ
అన్ని కుల వర్గాల సంఘాలకు సామూహిక భవనాలు నిర్మాణ పనులు పూర్తయితున్న జిల్లా అంబేద్కర్ భవనం కనీసం స్థల సేకరణ కార్యచరణ కొనసాగించడం లేదన్నారు జిల్లా కేంద్రం ఏర్పడిన కూడా జిల్లా స్థాయిలో అన్ని కుల మతాల భవనాలు ఏర్పడినప్పటికీ కూడా కేవలం మహనీయుల అంబేద్కర్ భవనం ఇంతవరకు నిర్మాణ కార్యచరణ పనులను ప్రజలకు సామాజిక సౌకర్యాల కొరకు. చేపట్టకపోవడం దురదృష్టమని అన్నారు. 10 సంవత్సరాలుగా నిలిచిపోయిన అంబేద్కర్ భవనం తక్షణమే నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చొరవ తీసుకొని చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధించిన అధికారులకు ఆదేశించాలన్నారు భవనం లేకపోవడం వివక్షతతో నిర్లక్ష్యానికి తగిన కారణాలు లోపాలను అధికమించుకొని సాధించుకోవడానికి సమావేశాల్లో దళిత సంఘాల నాయకులు వివరించారు ఎమ్మార్పీఎస్ ఇతర దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ భవనం నిర్మాణమే లక్ష్యంగా భవిష్యత్తు ఉద్యమాల కార్యచరణ ప్రకటించారు.అలాగే మెదక్ వెల్కమ్ బోర్డు రాందాస్ చౌరస్తా హెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రాంగణంలో మహనీయుల విగ్రహాలను యధావిధిగా రెండు అంబేద్కర్ విగ్రహాలు జగ్జీవన్ రావ్ విగ్రహాల ను అధికారికంగా పునర ప్రతిష్టించాలని కోరారు. పది సంవత్సరాల అవుతున్న విగ్రహాలను ఎక్కడి అక్కడే పుననిర్మించాలన్నారు పలువురు దళిత నాయకులు డిమాండ్ చేశారు.విగ్రహాలను వచ్చే నెల లోపే .ప్రతిష్టాపనలు చేయకుంటే దళిత సంఘాల ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కలెక్టరేట్ కార్యాలయం లో ఫిర్యాదులు ఇచ్చిన పట్టించుకోవడం లేదన్నారు. దళిత ఎస్సి సామాజిక ప్రయోజనాల పట్ల రాజ్యాంగ హక్కులను జిల్లా యంత్రాంగం అవహేళన పరుస్తుందని అన్నారు.తక్షణమే గత ప్రస్తుత ఫిర్యాదులపై అలసత్వం వీడి విగ్రహాలను అంబేద్కర్ భవన నిర్మాణ పెండింగ్ లో ఉన్నటువంటిని గుర్తించి నూతన పనులను బాధ్యత భారంగా నిర్మాణాలను వేగవంతం చేయవలసిన పనులను నెరవేర్చాలని అన్నారు. ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు మాసాపేట యాదగిరి మాదిగ,ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి మాదిగ,ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు ఉషన్న గళ్ళ మురళి, మెదక్ జిల్లా ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అస్తరుగళ్ల బాలరాజ్, ఎమ్మార్పీఎస్ మెదక్ మండల అధ్యక్షుడు చెవిటి గట్టయ్య, మెదక్ జిల్లా దళిత సంఘాల సీనియర్, డిపిఎఫ్ మెదక్ జిల్లా కార్యదర్శి దుబాషి సంజీవులు, దళిత నేత రామస్వామి, మెదక్ పట్టణ ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రభాకర్, తెలంగాణ టీఎస్ ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్, టీఎస్ ఎంఆర్పిఎస్ జాతీయ కార్యదర్శి పుర్ర ప్రభాకర్, మెదక్ జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొండి సామి,దళిత సీనియర్ నాయకులు గోపాల్, సురేష్, జయరాజు, తదితరులు పాల్గొన్నారు.









