*మహబూబాబాద్ పార్లమెంటు సీటును అన్ని రాజకీయ పార్టీలు ఆదివాసి సామాజిక వర్గానికి కేటాయించాలి…*
—ఓట్లు మావి సీట్లు లంబాడాలకా…?
—-ఇదెక్కడి సామాజిక న్యాయం
— జనాభా ధమాషా ప్రకారం ఆదివాసి లకు న్యాయం చెయ్యాలి
—-పార్టీలకు అతీతంగా ఐక్యం అవుతాం…
*జాతీయ ఆదివాసీ అఖిల పక్ష ప్రజా సంఘాల జెఏసీ పిలుపు*
*మహబూబాబాద్ పార్లమెంట్ టికెట్ ఆస్పిరంట్ చందా లింగయ్య దొర *
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
మహబూబాబాద్ పార్లమెంట్ సీటును అన్ని రాజకీయ పార్టీలు ఆదివాసీ సామాజిక వర్గానికే కేటాయించాలని, లేని పక్షం లో ఆదివాసీలం అందరం పార్టీలకు అతీతంతంగా ఒక్కటై ఆదివాసీ ఆస్తిత్వ పోరాటానికి శ్రీకారం చూడతామని
కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ టికెట్ ఆశా వాహులు చందా లింగయ్య దొర గారి డిమాండ్ మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని కోర్టు సెంటర్ లో ఉన్న ముత్యాలమ్మ తల్లి కి మొక్కుకున్నారు ఈ సందర్బంగా ఆదివాసిలకే అన్ని పార్టీలు టికెట్ ఇవ్వాలనే డా” బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా కర పత్రాన్ని ఆవిష్కరణ చేయటం జరిగింది ఈ సందర్బంగా చందా లింగయ్య దొర గారు మాట్లాడుతూ…
జనాభా ధమాషా ప్రకారం మహబూబాబాద్ పార్లమెంట్ సీటు ఆదివాసీ లకు దక్కాలి…
కానీ వరుసగా లంబాడా సామాజిక వర్గానికె కేటాయిస్తూ…
ఆదివాసిల ఆత్మ గౌరవాన్ని కించపరుస్తూ…
గౌరవం ఇవ్వడం లేదని, ఇది చాలా దారుణం అని
వరుసగా లంబాడా సామాజిక వర్గమైన 1) పోరిక బలరాం నాయక్, 2) అజ్మీరా సీతారాం నాయక్, 3) మాలోత్ కవిత లకు కేటాయించారు…
జనాభా
దామాషా ప్రకారం లంబాడా సామాజిక వర్గ జనాభా కంటే….
1 లక్షా 71 వేల 221 ఓట్లు ఆదివాసీ ల ఓట్లు ఎక్కువ ఉన్నాయి అయినా కానీ ఉద్దేశ్యపూర్వకంగా లంబాడాలకే కేటాయించడం అన్యాయం
ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తున్నాం
ఆదివాసీలం ఇప్పుడు ఇప్పుడే ఐక్యమౌవుతున్నాము… ఈ తరుణంలో…
వామపక్ష, విప్లవపార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, కవులు కళా కారులు మైనారిటీ లు మాకు జరిగే అన్యాయయాన్ని ఖండించాలని కోరుకుంటూ…
ఈ సారి మా ఆదివాసీలకు సీటు కేటాయించని యెడల ఆదివాసిలం అందరం పార్టీలకు అతీతంగా ఒక్కటై మా ఆదివాసి అభ్యర్థిని గెలిపించుకుంటామని డిమాండ్ చేస్తున్నాం…
ఈ కార్యక్రమంలో… ఆదివాసీ జాక్ రాష్ట్ర ఇంచార్జి, కన్వినర్ పొడుగు శ్రీనాద్,తుడుం దెబ్బ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు వట్టం నారాయణ, గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ, మహబాద్ జాక్ కన్వినర్ తాటి జనార్దన్, తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు కొమరం బుచ్చయ్య, పొలిటికల్ జాక్ రాష్ట్ర కన్వినర్ వాసం రామకృష్ణ దొర, జాతీయ ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం రాష్ట్ర కార్యదర్శి సోయం శుక్రామ్, భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి గొగ్గల ఆర్కే దొర, పినపాక మండల అధ్యక్షులు కొమరం శ్రీను, ప్రధాన కార్యదర్శి కుర్సం సారయ్య తదితరులు పాల్గొన్నారు.