నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
పినపాక మండలం కార్యదర్శుల సంఘం నూతన కమిటీ ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. పంచాయతీ కార్యదర్శుల సంఘం మండల
అధ్యక్షులుగా జక్కుల అశోక్ కుమార్,జనరల్ సెక్రటరీ గా ఓర్సు కృష్ణమూర్తి,ఉపాధ్యక్షులుగా పగిళ్ల సాయి కృష్ణ ,ట్రెజరర్ గా మల్లాడి ప్రశాంతి ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శిల మండల నూతన అధ్యక్షులు జక్కుల అశోక్ కుమార్ మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. నూతన కమిటీకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 111