* ఆకతాయి ఆటలు కట్టించిన ఏడూళ్ల బయ్యారం పోలీసులు
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(పినపాక):పినపాక మండలం జానంపేట లో ఓ యువకుడు ఈ నెల 17 అర్ధరాత్రి శ్రీ రాం అనే రైతు ఇంట్లో కి ప్రవేశించి CC Camera ముందు అశ్లీలంగా ప్రవర్తించి వారిని మానసిక వేధనకు గురిచేసిన విషయం విధితమే.ఈ నేపథ్యంలో ఏడూళ్ల బయ్యారం పోలీసులు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని బాధిత వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించారు. సి సి ఫుటేజీల ఆధారంగా అదే గ్రామానికి చెందిన సాయి అనే యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడని గుర్తించి బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. తక్షణమే స్పందించిన ఏడూళ్ల పోలీసులకు జానంపేట ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 117