*మావోయిస్టు ల సంచారమా?లేదా చిన్న పిల్లల కిడ్నాప్ ముఠా కోసమా?
*అపరిచిత వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో ని పలు గ్రామాలలో పోలీసుల గాలింపు చర్చనీయంగా మారింది. వివరాల్లోకి వెళితే… పినపాక మండలంలోని బోటిగూడెం, సీతంపేట, గడ్డంపల్లి, ఉప్పాక గ్రామాల్లో పోలీసులు తిరుగుతూ కొంతమంది వివరాలు సేకరిస్తున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇటీవల కాలంలో చత్తీస్గడ్ రాష్ట్రంలో మావోయిస్టులపై తీవ్ర నిర్బంధం పెరగడంతో వారు గోదావరి దాటి వచ్చారా?లేదా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పిల్లల కిడ్నాప్ ముఠా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంచరిస్తున్నట్లు సైతం పోస్టులు వైరల్ అయ్యాయి. వారేమైనా సంచరిస్తున్నారా అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ అపరిచితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులు ఎవరైనా గ్రా8 అనుమానస్పదంగా కనిపిస్తే పోలీసులకు లేదా100 కు సమాచారం ఇవ్వండి.
