ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి పీఏ నిరంజన్ చేతి వాటం.లక్ష బస్తాల ప్రభుత్వ వడ్ల కుంభకోణం?!
నేటి గదర్ న్యూస్, హైదరాబాద్:వంద కాదు,వెయ్యి కాదు.లక్ష బస్తాల ప్రభుత్వ వడ్ల కుంభకోణం!దీనిలో ఓ మంత్రి పీ ఏ హస్తం ఉన్నట్లు ఆరోపణలు మెండుగా వినబడుతున్నాయి.వివరాలు ఇలా ఉన్నాయి.
వనపర్తి జిల్లాలో లక్ష బస్తాల సీఎంఆర్ ధాన్యం కుంభకోణం జరిగింది.సీఎంఆర్ ధాన్యం తీసుకున్న రైస్ మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా లక్ష ధాన్యం బస్తాల పైగా దాచారు.ఈ విషయం తెలుసుకున్న జిల్లా మంత్రి అనుచరులు పెద్దకొత్తపల్లి మండలం పెద్ద కార్పాముల గ్రామానికి చెందిన కొంతమంది హమాలీల సాయంతో ఆ ధాన్యాన్ని దొంగిలిస్తూ పట్టుబడి అక్కడి నుంచి పరారయ్యారు.300 బస్తాలు నింపిన డీసీఎం, ఓ బొలెరో వాహనాన్ని పట్టుకొని చిన్నంబావి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు.
వాటిని వదిలేయాలని వనపర్తి డీఎస్పీ, సీఐ మీద ఒత్తిడి తెస్తున్న మంత్రి అనుచరులు.
