నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:
బస్సులు లేవని ప్రయాణికుల గొడవకు దిగారు.వివరాలు ఇలా ఉన్నాయి.హుజూరాబాద్ – ఆర్టీసీ బస్టాండులో నిన్న ఆదివారం రాత్రి కరీంనగర్, వరంగల్ వెళ్లేందుకు దాదాపు 200 మందికి పైగా గంటల తరబడి ఎదురుచూసినా బస్సులు రాలేదు.ఆర్టీసీ అధికారులకు ఫోన్ చేసినా వారు స్పందించలేదు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు కంట్రోలర్ పాయింట్ మీద దాడి చేసి అక్కడున్న బల్ల తీసుకొచ్చి బైట పడేశారు. పోలీసులు వచ్చి సముదాయించినా వారు వినలేదు.మరోవైపు కరీంనగర్ బస్టాండులో సైతం ఇదే పరిస్థితి నెలకొంది.
Post Views: 48