మణుగూరు సింగరేణి ఓపెన్ కాస్ట్ లో భాగంగా భూములు కోల్పోతున్న రామానుజవరం రెవెన్యూ రైతులకు నష్టపరిహారంతో సహా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని. సామాజిక కార్యకర్త కర్నె రవి అన్నారు. సోమవారం ఆయన సింగరేణి మణుగూరు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రజాభిప్రాయ సేకరణ గ్రామ సభలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ, సింగరేణి ఓపెన్ కాస్ట్ లో భాగంగా మణుగూరు మండలం రామానుజవరం రెవెన్యూ పరిధిలో రైతులు 813 ఎకరాలు కోల్పోతున్నారని , వారందరికీ సరైన నష్టపరిహారం కుటుంబంలో ఒకరికి తప్పకుండా ఉద్యోగ అవకాశము కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో రైతులు భూములు ఇచ్చే పరిస్థితి ఉండదన్నారు. ఉద్యోగం ఇచ్చే విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు.
Post Views: 95