నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: బూర్గంపాడు మండలం సారపాక పరిధిలో గల అన్ని మెడికల్ షాపుల్లో సోమవారం జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ సంపత్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ షాపుల నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనల పై వారికి అవగాహన కల్పించి, మెడికల్ షాపులో విక్రయిస్తున్న మందులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా మందులను విక్రయించవద్దని, ప్రతి ఒక్క మెడికల్ షాపులో ప్రార్మసిస్ట్ ఉండాల్సిందేనని ఆయన తెలిపారు. అదే విధంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులను విక్రాయించవద్దని, మత్తు మాత్రలు అమ్మే సమయంలో వాటిని విక్రయదారుడు ఎందుకు ఉపయోగిస్తున్నాడో ఆరా తీసిన తర్వాతనే విక్రయించాలని ఆయన తెలిపారు. అనంతరం నిబంధనలు విరుద్ధంగా నిర్వహిస్తున్న 10 దుఖానలు నిర్వాహకులకు నోటీసులు అందిచినట్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ సంపత్ తెలిపారు.









