+91 95819 05907

VENKATAPURAM: షెడ్యూల్ ఏరియాలో గిరిజనేతరులకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఒప్పుకోం

*గిరిజన చట్టాలను సమాధి చేస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ది చెందుతుందా..?*

*ప్రత్యేక ఆర్డినెన్సు తెచ్చి 29 ప్రభుత్వ శాఖల్లో ఆదివాసీలను నియమించాలి* రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు డిమాండ్..

నేటి గదర్ న్యూస్ ప్రతినిధి: వెంకటాపురం

రాష్ట్రంలో అభివృద్ధి గిరిజనుల సమాధుల పైన జరుగుతోంది అని ఆదివాసీ నవనిర్మాణ సేన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు
ఆరోపించారు. ఆదివారం ఒంటిమామిడి గ్రామం లో మండల ప్రధాన కార్యదర్శి కుంజ మహేష్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిదులు గా , ఏ ఎన్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు పాల్గొన్నారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాల వల్ల దేశం లోనీ ఆదివాసీల జీవన విధానం అధమ స్థానానికి చేరుకుందనీ మండిపడ్డారు. పదకొండో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి గృహలక్ష్మి పథకం ను ప్రారంభించడానికి వస్తున్న నేపథ్యంలో ఆదివాసీ నవనిర్మాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు ఈ విధంగా స్పందించారు. షెడ్యూల్డ్ చట్టాలను సమాధి చేయడానికి భద్రాచలం వస్తున్నావా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నిలదీశారు. షెడ్యూల్డ్ ప్రాంతమైన భద్రాచలం నియోజక వర్గంలో వలస గిరిజనేతరులకు 1/70 చట్ట విరుద్ధంగా గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు ఎలా కేటాయిస్తారని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ, రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన ఐదవ షెడ్యూల్డ్ ఏరియా గిరిజన చట్టాలను ఉల్లంఘించడం పైన నాగరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తచేశారు. ప్రభుత్వాలు, పాలకులు మారిన గిరిజన చట్టాల పైన వారి వైఖరి మారడం లేదన్నారు. నీళ్ళు ,నిధులు,నియామకాలు ఆంధ్రోళ్లు దోచుకుంటున్నారని పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిజానికి దోపిడీకి గురయ్యేది ఆదివాసీలే అని అన్నారు. ఏజెన్సీ ప్రాంతం లోని గోదావరి జలాలు, ఖనిజ సంపద, ఉద్యోగాలు అన్ని అన్యాక్రాంతం అవుతున్నటున్నట్లు ఆయన తెలియజేశారు. ఐదో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో తిష్ట వేసిన దోపిడీ దారులు అయిన వలస గిరిజనేతరులను మైదాన ప్రాంతానికి రలించి, వారి అక్రమ ఆస్తులను ఆదివాసీలకు పంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ డిమాండ్ చేశారు. గడిసిన ఎన్నికల్లో ఆదివాసీ లు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన్నప్పటికి ప్రభుత్వం మాత్రం బంజారాలు, గిరిజనేతరుల పక్షాన నిలబడటం దుర్మార్గపు చర్య అన్నారు. ఉమ్మడి షెడ్యూల్డ్ మండలాలను గత ప్రభుత్వం విచ్ఛిన్నం చేసి గిరిజన ఉప ప్రణాళిక గ్రామాలను సైతం మైదాన ప్రాంతాల్లో కలిపి గిరిజనుల జీవన విధ్వంసానికి కారణం అయిందని పేర్కొన్నారు. ఉమ్మడి షెడ్యూల్డ్ మండలాలను ఆ నియోజకవర్గ ,జిల్లాల పరిధిలోనే మరలా యదా తదంగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతం లోని ఆదివాసీ నిరుద్యోగుల కోసం ప్రత్యేకమైన ఆర్డినెన్సు సత్వరమే తీసుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు.అధికరణ 244 ప్రకారం ఐదో షెడ్యూల్డ్ ప్రాంతం స్వయం ప్రతిపత్తి కలిగినది కాబట్టి 29 ప్రభుత్వ శాఖల్లో ఆదివాసీల చేతనే నియమించాలని అన్నారు.ఈ కార్యక్రమం పోతురాజు, గోపి, గణేష్ ,రాజు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !