అనుమతులు లేని మద్యం అమ్మితే జైలుకే
కఠిన చర్యలు తప్పవు అంటున్న
* CI ఇంద్రసేనారెడ్డి
నేటి గదర్ న్యూస్, జూలూరుపాడు : అనుమతులు లేని మద్యం అమ్మితే జైలుకే అని JULURUPAD CI ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో జూలూరుపాడు పోలీస్ సర్కిల్ పరిధిలో ఎవరి వద్ద నైనా పరిమితి కి మించి మద్యం ఉన్నల ఎడల అట్టి మద్యం సీజ్ చేయడంతో పాటు కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.కాగా పక్క సమాచారం మేరకు పాపకొల్లులోని ఓ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా, పలు రకాల బ్రాండ్లకు చెందిన సుమారు రూ.1 లక్షా 19వేల విలువ కలిగిన మద్యం దొరికిందని జూలూరుపాడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిబంధనలను అందరూ కచ్చితంగా పాటించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెద్ద మొత్తంలో మద్యం నిల్వలు ఉంటే ముందుగానే రిటర్న్ చేయాలని, లేనిపక్షంలో చర్యలు ఉంటాయన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం నేరమని తెలిపారు. తనిఖీల్లో సబ్ ఇన్స్పెక్టర్ జీవన్ రాజు, సిబ్బంది ఉన్నారు.
