+91 95819 05907

తిరుమలాయపాలెం: BJP పాసిస్ట్ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా మహిళలు పోరాడాలి. : పి ఓ డబ్ల్యు రాష్ట్ర కోశాధికారి టీ ఝాన్సీ లక్ష్మి

నేటి గదర్ న్యూస్,ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి:
దేశంలో మునుపె న్నాడు లేని విధంగా బిజెపి కేంద్ర ప్రభుత్వ పాలనలో పాసిస్ట్ మతోన్మాద విధానాలు పెరిగిపోయి అమాయక ప్రజలు బల వుతున్నారని, మహిళలు చైతన్యతంగా పోరాడాలని ప్రగతిశీల మహిళా సంఘం (పి ఓ డబ్ల్యూ )రాష్ట్ర కోశాధికారి టీ ఝాన్సీ లక్ష్మీ పిలుపునిచ్చారు. సోమవారం తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంలో మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సభను శ్రామిక మహిళలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పనులు నిర్వహిస్తున్న పని ప్రదేశంలో సభను నిర్వహించారు. టీ ఝాన్సీ లక్ష్మి ముఖ్య వక్తగా హాజరై ప్రసంగిస్తూ,మోడీ 2016 సంవత్సరం నుండి “బేటీ బచావో, బేటీ పడావో” నినాదం చేపట్టారన్నారు . నిర్బర భారత్, వికసిత భారత్, అచ్చేదిన్ లాంటి నినాదాలు చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తాయన్నారు . కానీ విద్య, ఉపాధి, వేతనాలలో ఇలా అడుగడుగునా అన్నింటిలో స్త్రీలు వివక్ష నెదుర్కుంటూనే ఉన్నారన్నారు . మహిళా సంక్షేమం కోసం చట్టాలు ఎన్ని చేసినా దేశంలో రాష్ట్రంలో మహిళలు దాడులకూ, హత్యలకూ బలవుతూనే వున్నారన్నారు . భారతదేశ మహిళల్లో 70 శాతం మంది ఏదో ఒక హింసకు గురవుతున్నారని ఒక సర్వే తేల్చి చెప్పిందన్నారు . ప్రపంచంలో అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్న దేశాలలో మన దేశం మూడో స్థానంలో ఉందన్నారు . అంతేకాదు ప్రపంచ ఆహార ఉత్పత్తిలో మహిళలు 50% నుండి 80% వరకు భాగస్వాములవుతున్నారు. కానీ వీరు 10% కంటే తక్కువ భూమి కలిగి ఉన్నారన్నారు .
2023 యుఎన్ ప్రకారం 70% మందిగా ఉన్న మహిళల్లో 40% మంది పేద కుటుంబాలకు చెందిన వారేనన్నారు . పౌష్టికాహార లోపంతో వున్న ప్రతి ముగ్గురిలో ఒకరు భారతీయులే నన్నారు . ఆకలితో అలమటించే అన్నార్తుల జాబితాలో మనదేశం 111వ స్థానం దక్కించుకుంది. గత రెండు సంవత్సరాల కాలంలో ఒక్క శాతంగా ఉన్న బడాబాబుల ఆదాయం 30% పెరిగిందన్నారు . పేదల, శ్రమజీవుల ఆదాయం మాత్రం ఒక్క శాతానికి పడిపోయిందన్నారు . ఇది కాకులను కొట్టి గద్దలకు పెట్టిన చందంగా ఉందన్నారు . బీజేపీ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ధరలు ఎప్పుడూ లేనంతగా 30% నుండి 50%కు పెరిగాయన్నారు .

దేశంలో మహిళలు, వివిధ వర్గాల, వృత్తుల ప్రజలు సమస్యల సుడిగుండంలో ఉంటే వికసిత భారత్, అచ్చేదిన్ అంటున్నారన్నారు . మోడీ, పేదరికం, కరువుకు గురయ్యే ప్రజలు కేవలం 5% మాత్రమే పేదరికంలో ఉన్నారని ఆయన పాలనకు కితాబిచ్చుకుంటున్నారన్నారు.
బీజేపీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక, కార్పోరేట్ శక్తులకు కొమ్ముగాస్తున్న విధానాలను గురించి ప్రజానీకం ఆలోచించకుండా, ప్రశ్నించకుండా అయోధ్య రామాలయాన్ని ఉపయోగించుకుంటున్నాడన్నారు . చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీదన్న చందంగా ఉందన్నారు . బాలరాముడి ప్రాణ ప్రతిష్టపై నిష్టకంటే మోడీ మళ్ళీ అధిష్టాన ప్రతిష్టే, అధికార పీఠమెక్కే ప్రయత్నమే అయోధ్య ఆంతర్యంఅని అన్నారు . అన్నదమ్ముల్లా కలిసుండే ప్రజల్లో కలహాలు సృష్టిస్తోంది బీజేపీ ప్రభుత్వమన్నారు . మతం అనే మత్తు మందు వ్యాప్తి చేసి దేశ ప్రజానీకాన్ని మాయ చేస్తున్నారన్నారు . యువతరం మెదళ్ళలో విషబీజాలు నాటుతున్నారనారు .

రామరాజ్యమంటూ హిందువులను రెచ్చగొడుతున్నారన్నారు. మనుధర్మ రాజ్యాంగాన్ని తేవటానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు . ప్రశ్నించే గొంతులను నొక్కి వేస్తున్నారన్నారు . దేశ ద్రోహులంటూ జైళ్ళల్లో నిర్భందిస్తున్నారనారు . ప్రభుత్వం మేధావులపై, జర్నలిస్టులపై దాడులకు పూనుకున్న ఘటనలు ఎక్కువవుతున్నాయనారు . మహిళా రచయితలపై, ప్రజాస్వామికవాదులపై, సామాజిక కార్యకర్తలపై ఆర్ఎస్ఎస్ అనుచరగణం ట్రోలింగ్ చేస్తున్నారనారు.
గత సంవత్సరం రైతాంగం చేసిన ఉద్యమానికి తలొగ్గిన మోడీ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తానని మాట తప్పాడన్నారు . దీనితో రైతాంగం మలిదశ ఉద్యమానికి సిద్దమయిందన్నారు . ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యూ )పాలేరు డివిజన్ కార్యదర్శి గోకినేపల్లి సరోజిని ప్రసంగిస్తూ, మోడీ మొండి వైఖరి అవలంబిస్తూ, దేశానికి అన్నం పెట్టే అన్నదాతలపై లాఠీ, తూటాలను ప్రయోగిస్తున్నారనారు . రామరాజ్యమంటే ఇదేనానీ,రైతులేనిదే రాజ్యం లేదన్నారన్నారు . మోడీ రోటీ- బాటీ తినాలంటే అంబానీ, ఆదానీ కరెన్సీతో కడుపునిండదన్నారు. ఊరూరా మీరు పంపిణీ చేసే అక్షింతలు రైతన్నల కష్టార్జితమేనన్నారు.
బీజేపీ ప్రభుత్వం రాముడి పేరుతో రాజకీయ కుయుక్తులతో లబ్దిపొందాలని చూస్తున్న విధానాన్ని ప్రజలందరూ గమనించాలన్నారు . మతోన్మాదంతో ప్రజలను విభజించి, పాలించే దర్మార్గపు నీతిని ఎండగట్టాలన్నారు . మోడీ ప్రభుత్వమనుసరించే మతోన్మాద, ఫాసిస్టు చర్యలకు వ్యతిరేకంగా పోరాడుదామన్నారు . మన హక్కలనూ, లౌకిక ప్రజాస్వామ్యాన్నీ కాపాడుకొందామని ఆమె అన్నారు. ఈ సభలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పాలేరు డివిజన్ నాయకులు తిమ్మిడి హనుమంతరావు, పార్టీ తిరుమలాయపాలెం మండల కార్యదర్శి సోమనపల్లి వెంకటేశ్వర్లు, మండల నాయకులు ఎన్నబోయిన శ్రీనివాసరావు, అంగిరేకుల పిచ్చయ్య, గుజ్జ ఉమ, గుజ్జ వెంకటమ్మ, తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

Surya peta: వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎడ్ల బండ్లలో బయల్దేరిన సూర్యాపేట రైతులు.

వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎడ్ల బండ్లలో బయల్దేరిన సూర్యాపేట రైతులు. వరంగల్ లో జరుగనున్న BRS రజతోత్సవ సభకు వెళ్ళడానికి ఎడ్ల బండ్లతో సిద్ధమవుతున్న సూర్యాపేట రైతులు.. BRS రజతోత్సవ సభకు మేముసైతం

Read More »

పినపాకలో ఘనంగా ఏపీ సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు .

ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 75 వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం మండలంలో ఘనంగా జరిగాయి. పినపాక మండల తెలుగు దేశం పార్టీ

Read More »

నీటి వనరుల ద్వారా నూతన వ్యవసాయ విప్లవం – రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..!:- భట్టి విక్రమార్క మల్లు

నీటి వనరుల ద్వారా నూతన వ్యవసాయ విప్లవం – రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..!:- భట్టి విక్రమార్క మల్లు. మహదేవపురం ఎత్తిపోతల పథకం – సాగునీటి సరఫరాలో చరిత్రాత్మక ముందడుగు ఖమ్మం జిల్లా,మధిర మండలం,

Read More »

మతతత్వ పార్టీ ఆగడాలను అడ్డుకునే శక్తి ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది.

. బునియది ఆదివాసి, కార్యకర్తల సమ్మేళన్ శిక్షణ కార్యక్రమంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ వర్ధన్నపేట, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల కో ఆర్డినేటర్,రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..

Read More »

రామాయంపేట సిఎస్ఐ చర్చిలో ఘనంగా ఈస్టర్ పండగ వేడుకలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 20:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో సీఎస్ఐ చర్చి పాస్టర్ జి సత్యానందం గురువుల ఆధ్వర్యంలో క్రైస్తవులు శ్రమల దినాలలో 40 రోజుల పాటు ఉపవాస ప్రార్ధనలు

Read More »

వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం చేసిన తహసీల్దార్ రజనీకుమారి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 20:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రం

Read More »

 Don't Miss this News !