షెడ్యూల్డ్ ప్రాంతం చెరుకూరు, రేగులపాడు గ్రామంలో భూమి క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి పట్టించుకునే నాధుడే కరువాయే
1/70 చట్టం అమలు చేయవలసిన అధికారులు మౌనం.
ఆదివాసీల స్వయంపాలిత ప్రాంతాలలో గిరిజనేతరులకు హక్కే లేదు సార్ అయినా అన్ని అనుభవిస్తున్నారు ఎట్లా
నేటి గద్దర్ న్యూస్, వాజేడు:
ములుగు జిల్లా వాజేడు మండలం లక్ష్మీపురం గ్రామంలో తుడుందెబ్బ, జిఎస్పి, ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి పాయం జానకి రమణ, జీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు చింత మోహనరావు, మాట్లాడుతూ షెడ్యూల్డ్ ఏరియా ఆదివాసిల స్వయం పాలిత ప్రాంతమైన వాజేడు మండలం చెరుకూరు, రేగులపాడు గ్రామం లో జాతీయ రహదారికి ఇరువైపులా బహుళ అంతస్తుల నిర్మాణాలు, భూ క్రయ విక్రయాలు, జోరుగా సాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మౌనం పటిస్తున్నారనే ఆరోపణలు నిండుగా ఉన్నాయని వారన్నారు. ఎల్ టి ఆర్ ప్రకారం భూ బదలాయింపు జరిగితే తక్షణమే ఎల్ టి ఆర్ కేసు కట్టి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి లేని పక్షంలో నిరుపేద భూమిలేని ఆదివాసి ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివాసి ప్రాంతాలలో మరో చట్టం మలిదశ చట్టం ఎన్నో పోరాటాల ఫలితంగా 1/70, చట్టం అమలులోకి వచ్చింది. వచ్చిన నాటి నుండి నేటి వరకు చట్టం
పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఏజెన్సీ ప్రాంతాలలో కి వలస గిరిజనేతరులు రావడానికి కారకులైనారని, అధికారులు పాలక ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఆదివాసి చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని ఒకవైపు ప్రభుత్వం మరొకవైపు అధికారులు చట్టాల విషయంలో మౌనం పటిస్తున్నారని వారు ధ్వజమెత్తారు.
భారత రాజ్యాంగంలో ఆదివాసీలకు స్వయంపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన విషయం విధితమే కానీ గిరిజనేతరులకు షెడ్యూల్ ప్రాంతంలో హక్కులు ఎవరిచ్చారు. గిరిజన ప్రాంతాల్లోకి అక్రమంగా చొరబడి, గిరిజన చట్టాలను ఉల్లంఘన చేస్తున్న గిరిజనేతరులపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.