పంట ఎండిన ప్రతి ఎకరాకు 25 వేల పరిహారం చెల్లించాలి
*కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేసిన BRS నాయకులు
నేటి గద్దర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలో భాగంగా రైతులు పండించిన పంటకు క్వింటాకు 500/- రు. బోనస్ ఇవ్వాలని, పంట ఎండిపోయిన పతి ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కి బుధవారంవినతి పత్రాన్ని అందజేసారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ అధ్యక్షులు మాజీ MLA రేగా కాంతారావు ,MP మలోత్ కవిత ,అశ్వారావుపేట మాజీ MLA లు మెచ్చా నాగేశ్వరరావు ,తాటి వెంకటేశ్వర్లు , కొత్తగూడెం వనమా వెంకటేశ్వరరావు,ఇల్లందు మాజీ MLA హారి ప్రియ ,గ్రంధాల మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Post Views: 132