*పలు మార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన మహబూబాద్ ఎంపీ మాలోత్ కవిత
నేటి గద్ధర్ న్యూస్,కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాచలం గోదావరి నదిపై నిర్మించిన రెండో బ్రిడ్జిని ను జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా లాంఛనంగా ప్రారంభించారు. 2014 అప్పటి రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వంతెనకు శంకుస్థాపన చేశారు.పదేళ్లుగా నిర్మిస్తున్న ఈ వంతెనను శ్రీరామ నవమి నాటికి ప్రారంభిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు.ఈ బ్రిడ్జి 100 కోట్లు వ్యయంతో, రెండు కిలోమీటర్లు పొడవు నిర్మించారు. గోదావరి నదిపై నిర్మించిన భద్ర చలం బ్రిడ్జి జాప్యంపై మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విన్నపం చేసింది. జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కారీని నేరుగా ఢిల్లీలో కలిసి సమస్య తీవ్రతను విన్నవించారు. ఎట్టకేలకు బ్రిడ్జి ప్రారంభం కావడంతో భద్రాచలం కి వచ్చే భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
