+91 95819 05907

గిరిజన రైతులను ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి : ITDA PO

– ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్

నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 24, భద్రాద్రి కొత్తగూడెం (BHADRACHALAM):
ఆదివాసి గిరిజన రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని వడ్డీ వ్యాపారస్తులు అధిక శాతం వడ్డీతో పంటలకు పెట్టుబడి పెట్టి పంట చేతికి రాగానే వారు నిర్ధారించిన రేటుకి పండించిన పంట తీసుకోవడంతో రైతులు మోసపోతున్నారని, ఈ మధ్య దళారుల భారీ నుండి గిరిజన రైతులను ఆదుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్ లో పినపాక, మణుగూరు తహసిల్దార్ లు, ఎంపీడీవోలు, ఐకెపి సిబ్బందితో గిరిజన రైతులకు ఆర్థిక వెసులు బాటు కల్పించి, వారిని వడ్డీ వ్యాపారస్తుల కబంధహస్తాలలో, మధ్య దళారుల ఉచ్చులో పడకుండా కాపాడాలన్నారు. మహిళా సమైక్యల ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు అందించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం వర్షాలు పడగానే గిరిజన రైతులు దుక్కి దున్నుకొని పంటలు వేయడానికి సన్నద్ధమవుతారని అందుకు సంబంధిత ఐకెపి ఏపీఎంలు, సీసీలు మండల సమైక్య సభ్యులు గిరిజన రైతులకు వివో ద్వారా అవగాహన కల్పించాలన్నారు. తక్కువ వడ్డీతో వారికి ఆర్థిక సహాయం చేసి తిరిగి గిరిజన రైతుల నుండి వసూలు చేసుకునేలా రైతులకు నచ్చ చెప్పాలని ఆయన అన్నారు. మణుగూరు, పినపాక మండలాల్లోని గిరిజన రైతులకు తప్పనిసరిగా సంబంధిత ఐకెపి సిబ్బంది ప్రత్యేక బాధ్యత తీసుకొని వారికి ఆర్థికంగా ప్రోత్సాహం అందించాలని అన్నారు. గిరిజన రైతులు మాత్రం ప్రైవేటు ఫైనాన్సులు, వడ్డీ వ్యాపారులు, మధ్య దళారులు బారిన పడకుండా చూడాలని గిరిజన గ్రామాలలో మహిళా సమైక్యలకు సంబంధించిన వివోలు గిరిజన రైతులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వారికి సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నారు. గ్రామాలలో రైతు వేదికలు అందుబాటులో ఉన్న చోట గిరిజన రైతులను ఒక దగ్గర సమావేశపరచి వారికి ఎంత డబ్బు అవసరమో అంత వారికి ఇప్పించి పంటలు పండించుకునేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఖమ్మం డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని విజయలక్ష్మి, సురేష్ బాబు, ఏటీడీఓ నరసింహారావు, మణుగూరు తాసిల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, పినపాక తాసిల్దార్ రామకృష్ణ, ఎంపీడీవో సత్యనారాయణ, ఏపీఎంలు, సీసీలు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు తాము గుర్తించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటే అందులో దాదాపు

Read More »

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, ఆయన మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేసి సమాచారం వింటునట్లు ఆరోపించిన ప్రతిపక్షాలు ఏ ప్రభుత్వమైనా గూఢచార శాఖ ద్వారా

Read More »

ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ నిన్న పరీక్ష రాసి, కడుపునొప్పితో స్కానింగ్

Read More »

హానర్ ఏఐ (AI) ఫీచర్‌ అద్భుతం..

స్మార్ట్‌ఫోన్ రంగంలో హానర్ సంస్థ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రోబోటిక్ కెమెరా ఫోన్‌ను పరిచయం చేస్తూ, అతిచిన్న గింబల్‌పై 360 డిగ్రీలు తిరిగే 200MP కెమెరాను అమర్చింది. ఇది ఏఐ (AI) ఫీచర్‌తో

Read More »

పీఎం మోది ముందు చూపు

మోది గారి ముందు చూపు ఎందుకైనా మంచిదని రాజస్థాన్ బార్డర్‌లో 2500 కి.మీ. రేంజ్ కలిగిన ఆగ్ని-2 న్యూక్లియర్ కాపబుల్ మిస్సైల్‌ను మోహరించిన భారత్ Post Views: 6

Read More »

 Don't Miss this News !