నేటి గడ్డర్ న్యూస్, ఏప్రిల్ 27, ములుగు :
ములుగు జిల్లా వెంకటాపూర్ మండల పరిధిలోని ఇంచించెరువుపల్లి గ్రామానికి చెందిన మాజీ సహకార సంఘ సభ్యులు భూక్యా మీట్య తనయుడు దేవేందర్ ఇటివల మృతి చెందారు. కాగా శనివారం కిసాన్ కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షులు, ములుగు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గొల్లపల్లి రాజేందర్ గౌడ్ భూక్యా మీట్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పు మధుసూదన్ రెడ్డి, సహకార సంఘ సభ్యులు లకావత్ నరసింహ, నూనావత్ హుస్సేన్, ఉప్పునూతల సత్తయ్య, మాజీ ఉపసర్పంచ్ నర్రావుల సింహాద్రి తదితర నాయకులు పాల్గొన్నారు.
Post Views: 60