నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి (పినపాక)మే 7:
దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూళ్లలో 6,9 వ తరగతుల్లో ప్రవేశాలకు జనవరి 28న ఆఫ్ లైన్ విధానంలో ఎన్టీఏ AISSEE -2024 ప్రవేశ పరీక్ష నిర్వహించింది.గురువారం విడుదల చేసిన సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్ లో గల ఎక్సలెంట్ బాషా హై స్కూల్ విద్యార్థి సైనిక్ స్కూల్ లో సీట్ సాధించడం గొప్ప విషయం అని పాఠశాల డైరెక్టర్ బండారు నరేంద్ర,ప్రిన్సిపాల్ అంకం సురేష్ అన్నారు.జానంపేట గ్రామానికి చెందిన రామటెంకి గౌషిక్ తేజ్ 5వ ఎక్సలెంట్ బాషా హై స్కూల్ లో 5వ తరగతి చదువుతూ సైనిక్ స్కూల్ లో సీట్ సాధించడం పట్ల తల్లిదండ్రులు తమ ఆనందాన్ని ఎక్సలెంట్ భాష హై స్కూల్ యాజమాన్యం తో పంచుకున్నారు. ఉపాధ్యాయుల కృషితో,బట్టి విధానం కాకుండా,అర్థం చేసుకొని అవగాహన చేసుకునే విధంగా పాఠాలు చెప్తారని గౌశిక్ తేజ్ తల్లిదండ్రులు అన్నారు.ఈ సందర్బంగా ఎక్సలెంట్ స్కూల్ డైరెక్టర్ మరియు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ,ఏజెన్సీ ప్రాంతం లో బట్టీ చదువుకు స్వస్తి చెప్తూ మొన్న పదవ తరగతి ఫలితాలలో 10/10 7గురు విద్యార్థులు సాధించారని,గౌషిక్ తేజ్ ఉపాధ్యాయులు చెప్పింది చాలా శ్రద్దగా వింటాడని, క్రమశిక్షణతో అన్నింట్లో చాలా చురుకుగా ఉంటాడని అన్నారు.ఎక్సలెంట్ బాషా హై స్కూల్ యాజమాన్యం విద్యార్థిని శాలువా తో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎక్సెలెంట్ స్కూల్ గ్రూప్ అఫ్ చైర్మన్ యూసుఫ్ షరీఫ్,కరస్పాండెంట్ ఖాదర్,డైరెక్టర్స్ యాకుబ్ షరీఫ్, ముక్కు వెంకట నర్సారెడ్డి, బండారు నరేంద్ర,ప్రిన్సిపాల్ అంకం సురేష్,విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు