★మీ మౌనం తెలంగాణ క్షమించదు
★ సోషల్ మీడియాలో ట్రెండింగ్ పోస్ట్
నేటి గద్ధర్ వెబ్ డెస్క్: గత పది సంవత్సరాల కెసిఆర్ పాలనలో ప్రతి అంశాన్ని పూర్తత్వం లో పెట్టి చూపెట్టిన అప్పటి మీడియా మిత్రులు ఎక్కడ అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక అవస్థలు పడుతున్న ఇందుకు పాలకులను ప్రశ్నించడం లేదని సోషల్ మీడియా వేదికగా విద్యావంతులు యువకులు ప్రశ్నిస్తున్నారు. ప్యాకేజీలకు అమ్ముడుపోయి కేసీఆర్ పై విష ప్రచారం చేశారా? పదవుల కోసం అసత్యాలు ప్రచారం చేశారా? మీ మౌనం తెలంగాణ ప్రజలు క్షమించాలని పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలో ట్రెండింగ్ అవుతుంది.
★తెలంగాణలో లాకప్ డెత్ అయితే చప్పుడు లేదు.
★తెలంగాణలో సాగునీరు లేక రైతులు గోస పడితే చప్పుడు లేదు
★తెలంగాణలో రైతు భరోసా ఇవ్వకపోతే చప్పుడు లేదు
★తెలంగాణలో కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వకపోతే చప్పుడు లేదు
★తెలంగాణలో రైతు కూలీలకు రైతు భరోసా ఇవ్వకపోతే చప్పుడు లేదు
★తెలంగాణలో డిసెంబర్ 8 నాడు రుణమాఫీ చేస్తాను అని సీఎం మోసంచేస్తే చప్పుడు లేదు
★తెలంగాణ రైతు కళ్లాల్లో పంట అమ్ముకోలేక వర్షంపాలైతే చప్పుడు లేదు
★తెలంగాణలో తప్పుడు కేసులు పెట్టి ప్రజలను జైల్లో వేస్తే చప్పుడు లేదు
★తెలంగాణల్ గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా చప్పుడు లేదు
★తెలంగాణ స్కూళ్లలో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయితే చప్పుడు లేదు.
★తెలంగాణలో దళిత డిప్యుటీ సీఎంకు నిత్యం అవమానం జరిగితే చప్పుడు లేదు
★తెలంగాణలో ఏకపక్ష రెడ్డి రాజ్యం నడుస్తోంటే చప్పుడు లేదు.
★తెలంగాణలో అప్రకటిత కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బందిపడ్డా చప్పుడు లేదు.
★తెలంగాణలో నలుగురు జర్నలిస్టుల మీద భౌతికదాడి జరిగితే చప్పుడు లేదు.
★తెలంగాణలో 16 జిల్లాలు రద్దు చేస్తానని తుగ్లక్ సీఎం అంటే చప్పుడు లేదు
★తెలంగాణ మంత్రి కొడుకు ఒకరు వాచీల స్మగ్లింగ్ కేసులో దొరికినా చప్పుడు లేదు
★తెలంగాణలో మరోమంత్రి పేషీ ఇసుక స్మగ్లింగ్ కేసులో దొరికినా చప్పుడు లేదు తెలంగాణలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగినా చప్పుడు లేదు తెలంగాణ ఉద్యమకారులకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా చప్పుడులేదు
★తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నా చప్పుడు లేదు