నాసిరకంతో సిసి రోడ్డు నిర్మాణం…
అధికారుల పర్యవేక్షణ శూన్యం…
నేటి గద్దర్ న్యూస్,కరకగూడెం(మే16):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని దళిత కాలనీలో పంచాయతీరాజ్ నిధులతో నైనారపు రామకృష్ణ ఇంటి దగ్గర నుండి ముత్యాలమ్మ గుడి వరకు రెండు లక్షల 50 వేలు నిధులతో సిసి రోడ్డు మంజూరైనది.పంచాయతీరాజ్ నిబంధనల ప్రకారం సిసి రోడ్డు నిర్మాణం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నప్పటికీ ఆ నిబంధనలను తుంగలోతొక్కి సదర్ కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, నాసిరకం మెటీరియల్ తో సిసి రోడ్డు నిర్మాణం చేశారని దళిత కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.నాణ్యత ప్రమాణాలను పాటించకుండా సదర్ కాంట్రాక్టర్ ఇసుకకు బదులుగా ఇసుక లాంటి ఎర్ర మట్టితో సిసి రోడ్డు నిర్మించడం ఎంతవరకు సబబు అని దళిత కాలనీ వాసులు మండిపడుతున్నారు. సీసీ రోడ్డు వేసే ముందు జీఎస్పీని రెండు అంగుళాలు ఎత్తున పోసి వాటర్ కీరింగ్ చేస్తూ రోలింగ్ చేశాక అప్పుడు మాత్రమే దానిపై తీసి రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంటుంది కానీ అలాంటిదేమీ లేకుండానే తూ తూ మంత్రంగా జిఎస్పిని పై పైన చల్లి దాని పైన సిసి రోడ్డు నిర్మాణం చేయడం అంటే ఇంత కన్నా దారుణం ఏముందని కాలనీ వాసులు మండిపడుతున్నారు. ఎస్సీలు అంటే అధికారులు కూడా చులకన భావంతో చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన సిసి రోడ్డు నిర్మాణం అధికారుల జాడే లేకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
💥💥💥💥💥💥💥💥💥💥💥💥
ఏఈ వెంకటేశ్వర్లు వివరణ:
💥💥💥💥💥💥💥💥💥💥💥💥
కరకగూడెం దళిత కాలనీలో వేసిన సి సి రోడ్డు నిర్మాణంలో నాసిరకంతో రోడ్డు నిర్మాణం చేస్తున్నారని విషయాన్ని ఏఈ వెంకటేశ్వర్లును వివరణ కోసం చరవాని ద్వారా సంప్రదించగా అక్కడ అలాంటిదేమీ జరగడం లేదు.మీరు ఏమైనా మా పై అధికారులా అంటూ విరుచకపడ్డారు.









