సింగరేణి ఏరియా హాస్పిటల్ డాక్టర్ రమణ.
నేటి గద్దర్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 17 :
నైనారపు నాగేశ్వరరావు ✍️
7893538668
సింగరేణి సేవా సమితి మరియు సింగరేణి వైద్య ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని చినరావిగూడెం గ్రామంలో శుక్రవారం నాడు మణుగూరు ఏరియా జిఎం దుర్గం రామచందర్ ఆదేశాల మేరకు సింగరేణి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా సింగరేణి ఏరియా హాస్పిటల్ డాక్టర్ రమణ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం తమ వంతు కర్తవ్యం సామాజిక బాధ్యతగా ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు.అందులో భాగంగానే మున్సిపాలిటీ పరిధిలోని ఆదివాసి గ్రామమైన చినరావిగూడెంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు.ఈ వైద్య శిబిరంలో స్త్రీలు,పురుషులు,వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు.ఈ వైద్య శిబిరంలో 115 మందికి వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు.ఈ వైద్య శిబిరంలో సాధారణ సీజనల్ వ్యాధులతో పాటు బిపి,షుగర్ వ్యాధిగ్రస్తులను పరీక్షించి ఆయా వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు అందించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ కె సౌందర్యవతి హాస్పిటల్ సిబ్బంది శ్రీకాంత్,పవన్ కుమార్ గ్రామ పెద్దలు చిన్నరాజు తదితరులు పాల్గొన్నారు.