★మణుగూరు ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ బడగు ప్రభాకర్.
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 19:
మణుగూరు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటిఐ లో పదవ తరగతి ఉత్తీర్ణత చెందిన వారికి GPA మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ప్రారంభం జరుగుతున్నట్లుగా ప్రిన్సిపాల్ బడగు ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.ఏజెన్సీ ప్రాంత యువతి, యువకులకు తెలంగాణ ప్రభుత్వం ఐటిఐ కోర్సులు చదవడానికి మంచి అవకాశాలను కల్పించిందని మణుగూరు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ITI లో కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 2 యూనిట్లు,48 సీట్లు ఒక సంవత్సరం కోర్సు, ఎలక్ట్రిషన్ 2 యూనిట్లు,40 సీట్లు,2 సంవత్సరాలు కోర్సు, పిట్టర్-1 యూనిట్, 20 సీట్లు,2 సంవత్సరాల కోర్సు, డ్రాఫ్ట్ మెన్ సివిల్ ,1 యూనిట్,24 సీట్లు 2 సంవత్సరాల కోర్సు, డీజిల్ మెకానిక్-2 యూనిట్లు,1 సంవత్సరం కోర్సు,48 సీట్లు అవకాశం ఉన్నట్లుగా ఆయన తెలిపారు. ఈ అవకాశాలను యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తు చివరి తేదీ: 10-06-2024, iti.Telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలు తెలిపారు.