+91 95819 05907

అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన C M రేవంత్ రెడ్డి:KTR

★ రెండు లక్షల జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ ది

★ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించావు

★ ప్రజలు మార్పు కోరుకున్నారు.. గోసపడుతున్నారు

★ఒక్కసారి మోసపోవడం తప్పు మళ్లీ తెలిసే మోసపోతే భవిష్యత్ తరాలు గోసపడతాయి
★ నిరుద్యోగులకుCM రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలు అయ్యాయా?
★ గ్రాడ్యుయేట్ సోదరులు రాకేష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి

★ భద్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:అబద్ధపు,మోసపూరిత హామీలతో CM రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం జరిగిందని బీ ఆర్ ఏస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ లో సోమవారం నల్లగొండ BRS ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి విజయం కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.మాజీ సీఎం KCR దిశా నిర్దేశంతో పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం అద్భుత పురోగతి సాధించిన విషయం వాస్తవం కాదా అని అన్నారు. జిల్లాకు ఒక వైద్య కళాశాల,2లక్షల ఉద్యోగాలు, 11వేల పైచిలుకు కాంట్రాక్ట్ బేసి ఉద్యోగాలను పర్మినెంట్ చేసిన ఘనత KCR కే దక్కిందన్నారు. మెగా DSC, నిరుద్యోగ భృతి, కాంగ్రెస్ జాబ్ ఇవ్వాలి అండి ఎక్కడ అని ప్రశ్నించారు.ప్రజలు మార్పు కోరుకున్నారు.. గోసపడుతున్నారు.ఒక్కసారి మోసపోవడం తప్పు కాదు.. మళ్లీ తెలిసే మోసపోతే మన తప్పిదం అవుతుందని అన్నారు. అప్పుడు వ్యక్తికి ఓటు వేస్తే భవిష్యత్ తరాలు గోసపడతాయి అని అన్నారు. మాయ మాటల తీన్మార్ మల్లన్న కి ఓటు వేస్తే వ్యర్థం అన్నారు.విద్యావంతుడు, ప్రజల గొంతుక,సౌమ్యుడు BRS అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కి పట్టాభద్రులు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో రాజ్యసభ MP వద్ధి రాజు రవిచంద్ర,ఆ.డా. RS ప్రవీణ్ కుమార్, BRS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ,మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి,మాజీ గ్రంథాలయం చైర్మన్ దిండిగాల రాజేందర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRSఅధికార ప్రతినిధులు కోలేటి భవాని శంకర్, లకావత్ గిరిబాబు,వనామా రాఘవ ,బీ ఆర్ ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.15 కోట్లు: మౌలిక వసతులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి భూమిపూజ

​పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ

Read More »

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

 Don't Miss this News !